Samantha: చీర కట్టుకుని ఫైట్ చేయడం అంత ఈజీ కాదు: సమంత
ఈ వార్తాకథనం ఏంటి
నటి సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాను రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించారు. చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు దేవా కట్టా, డీకే, రాహుల్ రవీంద్రన్, నిర్మాతలు డి. సురేశ్‌బాబు, వై. రవిశంకర్, స్వప్న దత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వివరాలు
నటిగా, నిర్మాతగా బాధ్యతలు మోయడం చాలా కష్టం
ఈ సందర్భంగా మాట్లాడిన సమంత సినిమాపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ''ఈ సినిమాతో కచ్చితంగా ఒకొక్కర్ని ప్రేమతో కొడతా. మేమంతా ఈ చిత్రాన్ని ఎంతో ప్రేమతో రూపొందించాం. ఇప్పటివరకు నటిగా నా ప్రయాణం చాలా సాఫీగా సాగింది. కానీ నటిగా, నిర్మాతగా ఒకేసారి బాధ్యతలు నిర్వర్తించడం ఎంత కష్టమో గత నాలుగు, ఐదు రోజులుగా మరింత స్పష్టంగా అర్థమవుతోంది. అందరి సమష్టి కృషి వల్లే ఈ సినిమా రూపుదిద్దుకుందని చెప్పారు. ఇక సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ, ''ఈ చిత్రంలో నేను చాలా సహజంగా నటించగలిగానంటే దానికి ప్రధాన కారణం ఇందులోని సంభాషణలు. అలాగే చీర కట్టుకుని యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం చాలా కష్టంగా అనిపించింది.
వివరాలు
సినిమాలోని ఫైట్ సీన్లు ప్రేక్షకులను మెప్పిస్తాయి
అయినప్పటికీ సినిమాలోని ఫైట్ సీన్లు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారని సమంత పేర్కొన్నారు. దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ, ''నా సినీ జీవితంలో ఈ సినిమాకు పడినంత కష్టం మరే చిత్రానికీ పడలేదు. అయితే అందరి సహకారంతో కేవలం ఆరు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయగలిగాం. సమంత, రాజ్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తున్నాను. ఈ నెల 19న ప్రేక్షకులు తమకు నచ్చిన సమంతను పది రెట్లు గొప్పగా తెరపై చూస్తారని అన్నారు. ఈ ప్రీ-రిలీజ్ వేడుకలో గాయని చిన్మయి, నటుడు దిగంత్, ఆనంద్, హిమాంక్, శ్రీలక్ష్మి, గవిరెడ్డి, పొనీ వర్మ తదితరులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.