LOADING...
Telugu Film Chamber : ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు మరోసారి వాయిదా.. నిర్మాతల ఆగ్రహం!
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు మరోసారి వాయిదా.. నిర్మాతల ఆగ్రహం!

Telugu Film Chamber : ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు మరోసారి వాయిదా.. నిర్మాతల ఆగ్రహం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2025
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, చిత్రపురి కాలనీ కమిటీ ఎన్నికలను తక్షణమే నిర్వహించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ చిన్న నిర్మాతల ఆధ్వర్యంలో ఛాంబర్ ముందు ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ ఆర్టిస్ట్, నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీని రోడ్డు మీదకు లాగడం అనేది దుర్మార్గం. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అది ఛాంబర్ ద్వారానే జరగాలి. ఛాంబర్ అనేది మనకు ప్రభుత్వ బాడీలా పనిచేస్తుంది. అందుకే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు తప్పనిసరిగా జరగాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Details

సమ్మెల కారణంగా వరుస వాయిదాలు

ఈ వివాదం వెనుక అసలు సమస్య ఏమిటంటే, తెలంగాణ వర్గాల మధ్య విభేదాల భయంతో కొంతమంది సమావేశాలను తిరుపతిలో నిర్వహించారని తెలుస్తోంది. అదేవిధంగా, కార్మికుల సమ్మెల కారణంగా కూడా ఎన్నికలు వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎన్నోసార్లు ఎలక్షన్ కమిటీ (EC) సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించినా, ఇప్పటికీ ఎన్నికలు జరగకపోవడం వర్గాల్లో అసంతృప్తి కలిగించింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ప్రెసిడెంట్‌ను పిలిచినా కూడా ఆయన హాజరు కాకపోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితుల్లో, FDC చైర్మన్ దిల్ రాజు వెంటనే జోక్యం చేసుకొని ఎన్నికలు నిర్వహించాలని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

Details

ఆక్టోబర్ 26కి వాయిదా

ఇటీవల అక్టోబర్ 12న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించగా, ఆ తర్వాత మళ్లీ అక్టోబర్ 26కు వాయిదా వేశారు. "ఎన్ని సార్లు మాట మార్చుతారు? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పెట్టాల్సిన బాధ్యత తప్పనిసరిగా ఉంటుందని ఫిల్మ్ వర్గాలు ప్రశ్నించాయి. ఈ ధర్నాలో ప్రతాని రామకృష్ణ గౌడ్, గురురాజ్, మోహన్ గౌడ్ తదితరులు కూడా పాల్గొన్నారు. "ఐదేళ్లు అయ్యాక కూడా ఎన్నికలు పెట్టకుండా నేనే సీఎం అని ఎవరైనా చెప్పగలరా? అధికారంలో ఉన్నవాళ్లే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి" అని వారు వ్యాఖ్యానించారు.