Page Loader
Tollywood: సినీ సమస్యల పరిష్కారానికి ఫిల్మ్ ఛాంబర్ కీలక అడుగు..! 30 మందితో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు
సినీ సమస్యల పరిష్కారానికి ఫిల్మ్ ఛాంబర్ కీలక అడుగు..! 30 మందితో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు

Tollywood: సినీ సమస్యల పరిష్కారానికి ఫిల్మ్ ఛాంబర్ కీలక అడుగు..! 30 మందితో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు 30 మంది సభ్యులతో కూడిన ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి సమాన ప్రాతినిధ్యంతో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరిశ్రమను ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడమే కమిటీ లక్ష్యంగా ఉంది. ఈ కమిటీకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అలాగే ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో ప్రొడ్యూసర్ల విభాగం నుంచి 10 మంది సభ్యులుగా ఎంపికయ్యారు.

Details

ప్రొడ్యూసర్ల విభాగం నుంచి దిల్ రాజు, సి. కళ్యాణ్

వీర్లో దామోదర ప్రసాద్, దిల్ రాజు, ప్రసన్న కుమార్, సి. కళ్యాణ్, రవి కిశోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్, సుప్రియ ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్ విభాగం నుంచి భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి, సుధాకర్, శిరీష్ రెడ్డి, వెంకటేశ్ రావు, రాందాస్, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరి సభ్యులుగా ఉన్నారు. ఇక ఎగ్జిబిటర్ల విభాగం నుంచి రాంప్రసాద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, వీరనారాయణబాబు, శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, మహేశ్వర, శివప్రసాద్ రావు, విజయేందర్ రెడ్డిలు ఈ కమిటీలో స్థానం పొందారు. తెలుగు సినీ పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న వివిధ సమస్యలను అధ్యయనం చేసి, సమర్థవంతమైన పరిష్కార మార్గాలను సూచించేందుకు ఈ కమిటీ పనిచేయనుందని సినీ వర్గాలు తెలియజేశాయి.