Drugs smuggling: రూ.2000కోట్ల డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
రూ.2000 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నిర్మాత, డీఎంకే మాజీ కార్యకర్త జాఫర్ సాదిక్‌ను శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( NCB) అరెస్ట్ చేసింది.
నాలుగు నెలలుగా పరారీలో ఉన్న జాఫర్ సాదిక్‌ను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నట్లు ఎన్సీబీ తెలిపిది.
భారత్-ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌కు సాదిక్ కీలక సూత్రదారిగా ఎన్‌సీబీ అభివర్ణించింది.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు రూ. 2,000 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సాదిక్ అక్రమంగా రవాణా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిందితుడు 3,500 కిలోల సూడోపెడ్రిన్‌ను 45 సార్లు విదేశాలకు పంపినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
డ్రగ్స్
డ్రగ్స్ అమ్మిన సొమ్ముతోనే సినిమాల నిర్మాణం!
డ్రగ్స్ అమ్మడం ద్వారా వచ్చిన సొమ్ముతోనే జాఫర్ సాదిక్ పలు సినిమాలను నిర్మించినట్లు తెలుస్తోంది.
సాదిక్ ఇప్పటివరకు నాలుగు సినిమాలను నిర్మించాడు. అందులో ఒక సినిమా ఈ నెలలో విడుదల కానుంది.
మదురైలోని ఇద్దరు రైల్వే ప్రయాణికుల నుంచి, చెన్నైలోని డంప్‌యార్డు నుంచి రూ.180 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్న వారం తర్వాత సాదిక్ అరెస్ట్ కావడం గమనార్హం.
ఈ డ్రగ్స్‌ను శ్రీలంకకు పంపేందుకు సాదిక్ టీమ్ ప్లాన్ చేసినట్లు ఎన్‌సీబీ విచారణలో తేలింది.
జాఫర్ సాదిక్ గతంలో డీఎంకే ఎన్ఆర్ఐ విభాగంలో పని చేశారు. కానీ ఆయనపై డ్రగ్స్ ఆరోపణలు రావడంతో సాదిక్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు.