LOADING...
SSMB 29 : ఎట్టకేలకు క్లారిటీ.. మహేష్ బాబు టైటిల్ ఖరారు చేసిన జక్కన్న!
ఎట్టకేలకు క్లారిటీ.. మహేష్ బాబు టైటిల్ ఖరారు చేసిన జక్కన్న!

SSMB 29 : ఎట్టకేలకు క్లారిటీ.. మహేష్ బాబు టైటిల్ ఖరారు చేసిన జక్కన్న!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా, దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'SSMB29' వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక అప్‌డేట్‌ రాలేదు. అయితే ఇటీవల మేకర్స్‌ ఈ నెలలో అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Details

 నవంబర్‌ 15న వేడుక

నవంబర్‌ నెల మొదలైన వెంటనే మహేశ్‌ బాబు తన అధికారిక సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ద్వారా రాజమౌళిని ట్యాగ్‌ చేస్తూ 'నవంబర్‌ వచ్చేసింది' అంటూ ట్వీట్‌ చేయగా, రాజమౌళి ఫన్నీ కౌంటర్‌తో స్పందించడంతో ఆ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన భారీ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు జక్కన్న సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. నవంబర్‌ 11 లేదా 15న ఈ వేడుక జరగనున్న అవకాశాలు ఉన్నాయి. ఈ ఈవెంట్‌లోనే సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. కొంతకాలంగా 'SSMB29' టైటిల్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Details

త్వరలోని అధికారిక ప్రకటన

అయితే రాజమౌళి ఇప్పటికే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు, దానిని 'వారణాసి'గా లాక్‌ చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అదే టైటిల్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ గ్రాండ్‌ టైటిల్‌ రివీల్‌ ఈవెంట్‌కు మహేశ్‌ బాబు, రాజమౌళి తో పాటు బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్విరాజ్‌ సుకుమారన్ కూడా హాజరుకానున్నారని సమాచారం. ఈ కార్యక్రమంలో 'వారణాసి' టైటిల్‌ పోస్టర్‌తో పాటు మహేశ్‌ బాబు ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఈ వేడుక కోసం ఘట్టమనేని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.