LOADING...
Karnataka: దర్శన్ భార్య, కుమారుడుపై సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు: మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
దర్శన్ భార్య, కుమారుడుపై సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు: మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

Karnataka: దర్శన్ భార్య, కుమారుడుపై సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు: మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2025
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

శాండల్‌వుడ్ స్టార్ దర్శన్ భార్య విజయలక్ష్మి, అలాగే వారి కుమారుడు వినీశ్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు ఆకతాయిలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం పెను దుమారం రేపుతోంది. ఈ సంఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నెలమంగల నివాసి భాస్కర ప్రసాద్,దర్శకుడు దర్శన్‌ అభిమాని,మహిళా కమిషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఆయన,అభిమాన నటుడి భార్య,కుమారుని లక్ష్యంగా చేసుకుని అశ్లీల,అనుచిత పోస్టులు పెడుతున్నవ్యక్తులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

వివరాలు 

విచారణ వచ్చే వారానికి వాయిదా 

ఇక చిత్రదుర్గలో జరిగిన రేణుకాస్వామి హత్య కేసులో,దర్శకుడు దర్శన్,పవిత్రా గౌడ,నాగరాజ్, లక్ష్మణ్,ప్రదోశ్,అనుకుమార్,జగదీశ్‌లకు సంబంధించి బెయిల్ రద్దయిన తరువాత,నందీశ్,ధనరాజ్, వినయ్‌ల బెయిల్ కూడా రద్దు చేయాలంటూ ప్రభుత్వ న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన అర్జీను జస్టిస్ మహ్మద్ నవాజ్ వినిపించి,తదుపరి విచారణను వచ్చే వారం వరకు వాయిదా వేసారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దర్శన్ భార్య, కుమారుడుపై సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు