Upasana Konidela : తల్లి అయిన తర్వాత తొలి భావోద్వేగ పోస్ట్.. రామ్ చరణ్ దంపతుల వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (బాబు, పాప) జన్మించిన సంగతి తెలిసిందే. ఈ శుభవార్తను జనవరి 31న మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఉపాసన, తన డెలివరీకి ముందు ఎదురైన టెన్షన్, పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబంలో నెలకొన్న సందడిని వివరిస్తూ ఒక భావోద్వేగపూరిత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆవీడియో ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తన పోస్టులో ఉపాసన అపోలో ఆసుపత్రి వైద్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియోను ప్రతిసారి చూసినప్పుడు నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతోంది. మా కుటుంబంపై ఇంత అపారమైన ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
Details
అభిమానుల మద్దతు అమూల్యమైనవి
అపోలో ఆసుపత్రి వైద్యుల సంరక్షణ, రామ్ చరణ్ అభిమానుల మద్దతు అమూల్యమైనవి అంటూ ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ వీడియోలో డెలివరీ కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు, ఆ సమయంలో రామ్ చరణ్ తన పక్కనే ఉండి ఉపాసనకు ఇచ్చిన ధైర్యం హృదయాలను తాకుతున్నాయి. అలాగే ఈ ఆనందక్షణాలను గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. ఉపాసనకు జన్మించిన ఇద్దరు బిడ్డలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే క్లీంకార అనే కుమార్తె ఉన్న రామ్ చరణ్-ఉపాసన దంపతులకు, ఇప్పుడు ఒకేసారి కవల పిల్లలు రావడంతో మెగా అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ వీడియోలో ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్యులు కనిపించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది.