LOADING...
Bala Saraswathi: తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత
తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత

Bala Saraswathi: తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2025
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగులో తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి (97) ఇక లేరు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ఆమె కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1928లో జన్మించిన బాలసరస్వతి చిన్న వయసులోనే సంగీత ప్రయాణాన్ని ఆరంభించారు. కేవలం ఆరేళ్లకే పాటలు పాడటం మొదలుపెట్టారు. ఆకాశవాణి ద్వారా తెలుగు శ్రోతలకు ఆమె స్వరం పరిచయమైంది. 'సతీ అనసూయ' చిత్రంలో ఆమె మొదటిసారి గానం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ తదితర అనేక భాషల్లో మొత్తం రెండు వేలకుపైగా పాటలు పాడి తన స్వర మాధుర్యంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గాయని రావు బాలసరస్వతి దేవి (97) కన్నుమూత..