Page Loader
Kalingaraju: ఆశిష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగన 'కళింగరాజు' ఫస్ట్ లుక్ విడుదల 
ఆశిష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగన 'కళింగరాజు' ఫస్ట్ లుక్ విడుదల

Kalingaraju: ఆశిష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగన 'కళింగరాజు' ఫస్ట్ లుక్ విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2024
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

'నాటకం' ఫేమ్ ఆశిష్ గాంధీ, దర్శకుడు కళ్యాణ్‌జీ గోగన కాంబినేషన్‌లో 'కళింగరాజు' అనే సినిమా తెరకెక్కుతోంది. రిజ్వాన్, శ్రీ సాయి దీప్ చాట్ల కళింగరాజు మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. హీరోయిన్, మిగిలిన నటీనటులను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ బయటికి వచ్చింది.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మాస్ లుక్‌లో ఆశీష్ గాంధీ కనిపిస్తోన్నాడు. అతడి చేతిలో కత్తి అలాగే వెనుక గేదేలు, పక్కన పాల క్యాన్,అస్తమిస్తున్న సూర్యుడు కనిపిస్తున్నాడు. పోస్టర్ ఆసక్తికరంగా ఆకట్టుకుంటుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ రివేంజ్ డ్రామా కళింగరాజు సినిమా తెరకెక్కుతోంది.

Details 

యూనిక్ పాయింట్‌తో రాబోతున్న మూవీ 

రా అండ్ రస్టిక్‌గా ఉండబోతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో మాస్ రోల్‌లో ఆశీష్ గాంధీ కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు తెలుగు సినిమాలో రాని ఓ యూనిక్ పాయింట్‌తో ఈ మూవీ రాబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. 'జార్జ్‌రెడ్డి', 'విరాట పర్వం' ఫేమ్‌ సురేష్‌ బొబ్బిలి పాటలకు స్వరాలు సమకూరుస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ అందించిన ఈ చిత్రానికి కెమెరామెన్, దర్శకుడిగానూ సత్తా చాటుతున్న గరుడవేగ అంజి సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం. రాకేందు మౌళి పాటలు రచించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కళింగరాజు' ఫస్ట్ లుక్ విడుదల