Loading...
Ram Charan: సర్జరీ తర్వాత తొలి దర్శనం.. కోయంబత్తూరు అయ్యప్ప ఆలయంలో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు
ర్జరీ తర్వాత తొలి దర్శనం.. కోయంబత్తూరు అయ్యప్ప ఆలయంలో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు

Ram Charan: సర్జరీ తర్వాత తొలి దర్శనం.. కోయంబత్తూరు అయ్యప్ప ఆలయంలో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' ఇటీవల కుడిచేతి మణికట్టుకు విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. సర్జరీ అనంతరం తొలిసారిగా రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఆలయ దర్శనానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో రామ్ చరణ్-ఉపాసన దంపతులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.

వివరాలు

ప్రముఖ గంగా హాస్పిటల్‌ లో చికిత్స

ఇటీవల రామ్ చరణ్ కుడిచేతి మణికట్టు (Right Wrist) తీవ్ర సమస్యకు గురికావడంతో చికిత్స కోసం కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్‌ను ఆశ్రయించారు.

అక్కడ ఆయనకు అత్యంత విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ క్లిష్టమైన సర్జరీకి ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నాయకత్వం వహించారు.

గతంలో మెగాస్టార్ చిరంజీవి వెన్నెముకకు సంబంధించిన క్లిష్టమైన సమస్యను కూడా విజయవంతంగా చికిత్స చేసిన వైద్యుడు ఆయనే కావడం విశేషం.

రామ్ చరణ్ మణికట్టు సమస్యకు అత్యుత్తమ వైద్యం అందించాలనే ఉద్దేశంతో అమెరికాలోని మయామికి చెందిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ప్రత్యేకంగా కోయంబత్తూరుకు రప్పించి శస్త్రచికిత్స నిర్వహించారు.

వివరాలు

విజయవంతంగా  సర్జరీ పూర్తి

వైద్యుల బృందం సమన్వయంతో సర్జరీ విజయవంతంగా పూర్తైంది.

శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న రామ్ చరణ్, ఆరోగ్యం మెరుగుపడిన నేపథ్యంలో ఈ రోజు ఉపాసనతో కలిసి కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం అభిమానులను ఆనందానికి గురిచేసింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

ADVERTISEMENT