
Double Ismart : దుమ్ము రేపుతున్నఎనర్జిటిక్ స్టార్.. డబుల్ ఇస్మార్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ మరో సారి చేతులు కలిపారు.
డబుల్ ఇస్మార్ట్ అనే మాస్ ఎంటర్‌టైనర్. మొదటి భాగం ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మాస్ సెంటర్స్ లో ఉత్కంఠ రేపింది.
ఇస్మార్ట్ శంకర్ విజయంలో రామ్ పోతినేని తనదైన నటనతో దుమ్ము రేపారు.
మణిశర్మ సంగీతం యూత్ ను బాగా ఆకట్టుకుంది .చిత్రవిజయంలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి.
కొన్ని నిమిషాల క్రితం, డబుల్ ఇస్మార్ట్ బృందం మొదటి సింగిల్, స్టెప్పమార్ కోసం ప్రోమోను విడుదల చేసింది.
మొదటి భాగాన్ని మించిన యాక్షన్ , మాస్ పాటలతో అలరిస్తామని చిత్ర యూనిట్ ధీమాగా చెప్పింది. .
వివరాలు
డబుల్ ఇస్మార్ట్ లో విలన్‌గా సంజయ్‌దత్
ట్రేడ్‌మార్క్ రామ్ పోతినేని డ్యాన్స్‌తో ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉంటుందని టీమ్ తెలిపింది.
భాస్కరభట్ల సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి , సాహితీ ఈ మాస్ పాటకు గానం అందించారు.
మణిశర్మ సంగీత దర్శకుడు. పూర్తి పాటను జూలై 1న విడుదల చేయనున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మి కౌర్, పూరీ జగన్నాధ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బన్ని జె, అలీ, గెటప్ శ్రీను, సాయాజీ షిండే, మకరంద్ దేశ్‌పాండే, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆయియే! అపున్ కా ఇస్టయిల్ క్యా హై మాలుమ్???
Aaayyyeee! Apun ka iStyle kya hai maalum???https://t.co/ZyHv1kIJJG #STEPPAMAAR
— RAm POthineni (@ramsayz) June 29, 2024
-Ustaad #DoubleISMART Shankar pic.twitter.com/ASmj7kBJLB