Page Loader
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: మొదటి పాటలో అదిరిపోయిన విశ్వక్ సేన్, నేహాశెట్టి రొమాన్స్ 
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుండి మొదటి పాట విడుదల

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: మొదటి పాటలో అదిరిపోయిన విశ్వక్ సేన్, నేహాశెట్టి రొమాన్స్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 16, 2023
06:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇదివరకు ఈ సినిమా నుండి చిన్న గ్లింప్స్ వీడియో మాత్రమే రిలీజైంది. తాజాగా ఒక పాటను కూడా రిలీజ్ చేసారు. సుట్టంలా సూసి పోక, సుట్టేసుకోవే చీరలా అనే పాట అద్భుతంగా ఉంది. ఈ పాటలో విశ్వక్ సేన్, నేహాశెట్టి మధ్య మాంచి కెమిస్ట్రీ కనిపిస్తోంది. పీరియాడిక్ మూవీ కావడంతో పాటలోనూ పీరియాడిక్ టచ్ కనిపించింది. కళ ఉన్న కళ్ళకే కాటుకే ఏలా, మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మోతలా, సందేళ పాటలా, సందళ్ళే తెచ్చావే నీలా.. వంటి లిరిక్స్ పాడుకోవడానికి వీలుగా ఉన్నాయి.

Details

యువన్ శంకర్ రాజా సంగీతంలోంచి వచ్చిన పాట 

అనురాగ్ కులకర్ణి గొంతులోంచి వచ్చిన ఈ పాట వింటూన్న కొద్దీ వినాలనిపించేలా ఉంది. శ్రీహర్ష ఈమణి అందించిన సాహిత్యం సరళంగా, సున్నితంగా, రమ్యంగా ఉంది. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు విశ్వక్ సేన్ కెరీర్లో వచ్చిన పాటలన్నింటిలోకి ఈ పాట తనకు ప్రత్యేకంగా నిలుస్తుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ, ఎస్ సౌజన్య నిర్మాతలుగా ఉన్నారు. ఈ సంవత్సరం డిసెంబరులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాట విడుదలపై విశ్వక్ సేన్ ట్వీట్