Toxic OTT : రూ.150 కోట్ల నుంచి రూ.30 కోట్లకు.. 'టాక్సిక్' OTT ఆఫర్‌లో భారీ షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
'కేజీఎఫ్' ఫ్రాంచైజ్‌తో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న రాకింగ్ స్టార్ యశ్ నటించిన తాజా చిత్రం 'టాక్సిక్'. భారీ అంచనాల మధ్య గత నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. కథ, కథనం, దర్శకత్వం సహా పలు విభాగాల్లోనూ ప్రేక్షకుల నుంచి ప్రతికూల స్పందన రావడంతో.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. దీంతో ఈ సినిమా బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. 'టాక్సిక్' డిజిటల్ రైట్స్ విషయంలో చిత్రబృందానికి ఊహించని షాక్ తగిలినట్లు సమాచారం.
వివరాలు
రూ.150 కోట్లకు పైగా ఆఫర్లు.. అప్పట్లో నో!
భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడం డిజిటల్ మార్కెట్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
సినిమా థియేటర్లలో విడుదలకు ముందే 'టాక్సిక్' డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి భారీ ఆఫర్లు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
దాదాపు రూ.150 కోట్లకు పైగా డిజిటల్ రైట్స్ కోసం ఆఫర్లు వచ్చినట్లు టాక్ నడిచింది. అయితే మేకర్స్ మాత్రం అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఆశించడంతో.. ఆ సమయంలో వచ్చిన డీల్స్ ఏవీ ఖరారు కాలేదని సమాచారం.
అయితే థియేట్రికల్ రిలీజ్ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
వివరాలు
ఇప్పుడు రూ.30 కోట్లకేనా?
సినిమాకు డిజాస్టర్ టాక్ రావడం, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు కాకపోవడంతో.. 'టాక్సిక్' డిజిటల్ మార్కెట్ కూడా భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. 'టాక్సిక్' డిజిటల్ హక్కులను కొనుగోలు చేసేందుకు ప్రముఖ డిజిటల్ సంస్థ 'జీ స్టూడియోస్' మాత్రమే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆ సంస్థ నుంచి వచ్చిన ఆఫర్ కేవలం రూ.30 కోట్లకు పరిమితమైనట్లు సమాచారం.
విడుదలకు ముందు రూ.150 కోట్లకు పైగా ఆఫర్లు వచ్చినట్లు ప్రచారం జరగగా.. ఇప్పుడు కేవలం రూ.30 కోట్లకు డిజిటల్ డీల్ పరిమితమవడం మేకర్స్‌కు భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.