Page Loader
Kuberaa: 'ఆనంద్' నుంచి 'కుబేర' వరకు.. శేఖర్ కమ్ముల టాప్ 5 మూవీస్ చూశారా? అస్సలు మిస్ కావొద్దు! 
'ఆనంద్' నుంచి 'కుబేర' వరకు.. శేఖర్ కమ్ముల టాప్ 5 మూవీస్ చూశారా? అస్సలు మిస్ కావొద్దు!

Kuberaa: 'ఆనంద్' నుంచి 'కుబేర' వరకు.. శేఖర్ కమ్ముల టాప్ 5 మూవీస్ చూశారా? అస్సలు మిస్ కావొద్దు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 11, 2025
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినిమా ప్రపంచంలో శేఖర్ కమ్ముల ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు. ఫ్యామిలీ ఎమోషన్స్, సాఫ్ట్ లవ్ స్టోరీస్‌తో మనసులను తాకే సినిమాలు తీర్చిదిద్దే దర్శకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. డాలర్ డ్రీమ్స్ నుంచి లవ్ స్టోరీ వరకూ ఆయన తీసిన ప్రతి సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. ఇప్పుడు ఆయన 'కుబేర' అనే కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శేఖర్ కమ్ముల మూవీకి ఫ్యాన్ బేస్ వేరే స్థాయిలోనే ఉంది! శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలు ఇప్పటికీ ఓటీటీల్లో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఆ మూవీల్లో ముఖ్యమైనవి

Details

హ్యాపీ డేస్

యువతలో అత్యంత పాపులర్ అయిన ఈ చిత్రం శేఖర్ కమ్ముల కెరీర్‌కు బలమైన మైలురాయిగా నిలిచింది. నిఖిల్, వరుణ్ సందేశ్, తమన్నా లాంటి యంగ్ స్టార్లు ఇందులో నటించారు. ఇంజినీరింగ్ కాలేజీ రోజుల జ్ఞాపకాలను తిరగబెట్టేలా సినిమా తెరకెక్కింది. ప్రస్తుతానికి ఇదిAmazon Prime Video, Sun NXT లో అందుబాటులో ఉంది. ఆనంద్ రాజా, కమలినీ ముఖర్జీ జంటగా వచ్చిన ఈ క్లాస్‌ లవ్ స్టోరీలో, మనసును తాకే భావోద్వేగాలు హైలైట్ అయ్యాయి. ఓ మంచి కాఫీ తాగే అనుభూతిని కలిగించేలా ఈ సినిమా తీర్చిదిద్దారు. గోదావరి సుమంత్, కమలినీ ముఖర్జీ జంటగా నటించిన ఈ చిత్రం,గోదారి అందాలను చూపిస్తూ, ప్రేమకథను తేటతెల్లంగా చాటింది. ఫ్యామిలీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

Details

లీడర్ 

ప్రేమ కథల కన్నా భిన్నంగా, రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ద్వారా రానా దగ్గుబాటి హీరోగా పరిచయం అయ్యారు. రాజకీయాలు, నైతికత, సమాజం అనే అంశాల్ని శక్తివంతంగా చూపించిన ఈ చిత్రం ఇప్పుడు ZEE5, YouTube లో అందుబాటులో ఉంది. లవ్ స్టోరీ నాగచైతన్య, సాయిపల్లవి జంటగా వచ్చిన ఈ చిత్రం, సామాజిక అంశాన్ని టచ్ చేస్తూ తెరకెక్కిన సున్నితమైన ప్రేమ కథ. రాజీవ్ కనకాల నెగెటివ్ రోల్‌లో ఆకట్టుకున్నారు. ఈ సినిమా AHAA, YouTube లో స్ట్రీమింగ్ అవుతోంది.

Details

 'కుబేర'తో మరో ప్రయోగం

శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'కుబేర' జూన్ 20న విడుదల కాబోతోంది. ఇందులో నాగార్జున, ధనుష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా, జిమ్ సర్బ్, ప్రియాంశు ఛటర్జీ, దలీప్ తాహిల్ వంటి కీలక నటులు కూడా ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.