LOADING...
Shah Rukh Khan: బాలీవుడ్‌ కింగ్‌ నుంచి బిలియనీర్‌గా.. షారుక్ ఖాన్ ఎదిగిన ప్రయాణమిదే!
బాలీవుడ్‌ కింగ్‌ నుంచి బిలియనీర్‌గా.. షారుక్ ఖాన్ ఎదిగిన ప్రయాణమిదే!

Shah Rukh Khan: బాలీవుడ్‌ కింగ్‌ నుంచి బిలియనీర్‌గా.. షారుక్ ఖాన్ ఎదిగిన ప్రయాణమిదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్‌ ఈరోజు తన 60వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ బర్త్‌డే ఆయనకు మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే, తాజాగా విడుదలైన 'M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025'లో షారుఖ్ ఖాన్‌ తొలిసారిగా బిలియనీర్‌గా స్థానం దక్కించుకున్నారు. దిల్లీ నుంచి ముంబైకి వచ్చి తన ప్రతిభతో బాలీవుడ్‌లో 'కింగ్ ఖాన్'గా ఎదిగిన షారుఖ్‌ ఇప్పుడు బిలియనీర్ల క్లబ్‌లోకి చేరడం విశేషం.

Details

60వ జన్మదినం - మరో మైలురాయి

షారుఖ్ ఖాన్‌ 1965 నవంబర్‌ 2న జన్మించారు. ఈరోజుతో ఆయనకు 60 ఏళ్లు నిండాయి. చిన్న తెర నుంచి బిగ్ స్క్రీన్‌ వరకూ సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన బాలీవుడ్‌లో అగ్రస్థానాన్ని సంపాదించారు. 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే', 'దిల్ తో పాగల్ హై', 'కరణ్ అర్జున్', 'కుచ్ కుచ్ హోతా హై' వంటి క్లాసిక్‌ల నుంచి 'పఠాన్', 'జవాన్' వంటి బ్లాక్‌బస్టర్‌ల వరకు తన నటనతో కోట్లాది మందిని ఆకట్టుకున్నారు.

Details

బిలియనీర్ల క్లబ్‌లో షారుఖ్ ఖాన్

తాజాగా విడుదలైన M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌ 2025 ప్రకారం, షారుఖ్ ఖాన్‌ రూ.12,490 కోట్ల నికర ఆస్తులతో బిలియనీర్‌గా నిలిచారు. గత సంవత్సరం కంటే ఆయన సంపద 71% పెరిగింది. ఆయన ఆదాయంలో ఎక్కువ భాగం సినిమాలు, నిర్మాణం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారానే వస్తుంది. బాలీవుడ్‌లో అత్యధికంగా ఆర్జించే నటుడిగా ఆయన స్థానం మరింత బలపడింది. షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఆయన సంపద పెరుగుదలలో కీలక పాత్ర పోషించింది. షారుఖ్ నటించిన జవాన్ సినిమా రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, భారత బాక్సాఫీస్ వద్ద రూ.640.25 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.1,160 కోట్లు వసూలు చేసింది.

Details

అత్యధిక పన్నులు చెల్లించే స్టార్‌గా గుర్తింపు

షారుఖ్ ఖాన్‌ కేవలం ధనవంతుడు మాత్రమే కాదు, అత్యధిక పన్నులు చెల్లించే నటులలో అగ్రస్థానంలో ఉన్నారు. ఫార్చ్యూన్ ఇండియా నివేదిక ప్రకారం, ఆయన 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.92 కోట్ల పన్నులు చెల్లించారు. మొత్తం మీద, షారుఖ్ ఖాన్‌ తన 60వ పుట్టినరోజున ఒక కొత్త శిఖరాన్ని చేరుకున్నారు. అభిమానులకు ఇది డబుల్ సెలబ్రేషన్‌గా మారింది.