
Re Release : హుషారు నుంచి గజినీ వరకు.. జూలై రీ-రిలీజ్ సినిమాల జాబితా ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ వేగంగా పుంజుకుంటోంది. ప్రతి నెలా ఓనాటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. 'మురారి', 'సింహాద్రి', 'ఆరెంజ్', 'చెన్నకేశవ రెడ్డి', 'ఖుషి' వంటి పాత హిట్ సినిమాలు రీ రిలీజ్ ద్వారా భారీ కలెక్షన్లు రాబట్టడంతో ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ మిగతా సినిమాలు కూడా క్యూలో నిలుస్తున్నాయి. ఇప్పుడు జూలై మాసంలోనూ పలు చలనచిత్రాలు మళ్లీ వెండితెరపైకి వస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం
Details
హుషారు - జూలై 5
2018లో విడుదలైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. మళ్లీ జూలై 5న థియేటర్లలోకి వస్తోంది. ఎమ్.ఎస్.ధోనీ - జూలై 7 భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని బయోపిక్‌గా వచ్చిన ఈ సినిమా జూలై 7న, ధోని పుట్టినరోజు సందర్భంగా తిరిగి రిలీజ్ కానుంది. కుమారి 21F - జూలై 10 రాజ్ తరుణ్ కెరీర్‌లోనే ది బెస్ట్ సక్సెస్‌గా నిలిచిన ఈ సినిమా జూలై 10న మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మిరపకాయ్ - జూలై 11 రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ జూలై 11న మరోసారి తెరపైకి వస్తోంది.
Details
గజినీ - జూలై 18
సూర్యను స్టార్‌గా నిలబెట్టిన ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జూలై 18న మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. ఏ మాయ చేసావే - జూలై 19 నాగచైతన్య-సమంతల ప్రేమకథను తెరపై అందించిన ఈ హార్ట్ టచ్ లవ్ స్టోరీ జూలై 19న మళ్లీ రిలీజవుతోంది. వీడొక్కడే - జూలై 19 విభిన్న కథాంశంతో అప్పట్లో దూసుకుపోయిన ఈ సినిమా కూడా అదే రోజు, జూలై 19న మరోసారి థియేటర్లలోకి వస్తోంది. ఇలా రీ రిలీజ్ వేదికగా ప్రేక్షకులు తమ ఫేవరెట్ సినిమాలను మళ్లీ మజిలీ చేస్తుండగా, నిర్మాతలకు మాత్రం అదనపు ఆదాయ మార్గంగా మారుతోంది.