Page Loader
VV Vinayak: మాస్‌ డైరెక్టర్‌ నుంచి రియల్ హీరోగా.. వి.వి. వినాయక్‌ బర్త్‌డే స్పెషల్‌ 
మాస్‌ డైరెక్టర్‌ నుంచి రియల్ హీరోగా.. వి.వి. వినాయక్‌ బర్త్‌డే స్పెషల్‌

VV Vinayak: మాస్‌ డైరెక్టర్‌ నుంచి రియల్ హీరోగా.. వి.వి. వినాయక్‌ బర్త్‌డే స్పెషల్‌ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 09, 2024
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ దర్శకుల్లో ఒక్కో వ్యక్తికి ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. కానీ యాక్షన్‌ సినిమాల ప్రపంచంలో వినాయక్‌ పేరు చెప్పగానే ప్రేక్షకులు మాస్‌ యాక్షన్‌ సన్నివేశాలు, సుమోలు గాల్లో లేవడాన్ని గుర్తు చేసుకుంటారు. నేడు ఆయన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, ఈ డైరెక్టర్‌ సినీ ప్రయాణంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వివి వినాయక్‌ పూర్తి పేరు గండ్రోతు వీర వెంకట వినాయకరావు. ఆయన సినీ ప్రయాణం తటస్థంగా ప్రారంభం కాలేదు. మొదటిసారి చెన్నై వెళ్లినప్పుడు ఆశలు తగ్గినా, దృఢనిశ్చయంతో మళ్లీ ప్రయత్నం చేశారు. 'అమ్మ దొంగా' చిత్ర దర్శకుడు సాగర్‌ వద్ద పనిచేసిన తర్వాత, కొన్నాళ్ల పాటు కో-డైరెక్టర్‌గా పనిచేశారు.

Details

'అది' సినిమాతో తొలి హిట్ సాధించిన వినాయక్

మొదట ఆయన రాసిన కథ బాలకృష్ణకు అనుకూలంగా ఉండేది. కానీ, ఎన్టీఆర్‌తో చేసిన 'ఆది' సినిమా టాలీవుడ్‌లో ఆయనకు తొలిసారిగా పెద్ద విజయం తెచ్చింది. ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన 'ఆది' సినిమాతో వినాయక్‌ టాలీవుడ్‌లో మాస్‌ హీరోయిజాన్ని కొత్త పంథాలో చూపించారు. సినిమాలో బ్లాస్టింగ్ సన్నివేశాలు, సుమోలు గాల్లో లేవడమే కాకుండా, కొత్త తరహా యాక్షన్‌ విజువల్స్‌ను తెరపై పెట్టడం ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఆ సినిమా తరువాత, వినాయక్‌ వరుసగా 'దిల్‌', 'ఠాగూర్‌' వంటి సూపర్ హిట్ విజయాలను అందుకున్నారు.

Details

అగ్రహీరలతో పని చేసిన వినాయక్

తన అద్భుత మాస్‌ డైరెక్షన్‌ స్కిల్స్‌తో అగ్ర హీరోలతో పని చేసిన వినాయక్, కొన్నాళ్ల క్రితం హీరోగా "సీనయ్య" అనే చిత్రంలో నటించాలనుకున్నారు. కానీ ఆ చిత్రం ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఆయన ఆఖరి చిత్రం హిందీ రీమేక్‌ 'ఛత్రపతి' 2023లో విడుదలైంది.