
Kalyani Priyadarshan : అనాథ ఆశ్రమం నుండి బాక్సాఫీస్ హిట్ దాకా.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్
ఈ వార్తాకథనం ఏంటి
హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుతోంది. తాజాగా విడుదలైన 'లోకా' సినిమాతో ఆమె మంచి హిట్ సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 266 కోట్లు వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. దీంతో కల్యాణి * సంతోషంలో మునిగిపోయింది. హిట్ ఫలితంతో ఆమెకు వరుసగా కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె మీడియా ఇంటర్వ్యూలను ఇస్తోంది.
Details
చిన్నప్పటి విషయాలను వెల్లడించిన హీరోయిన్
తాజాగా ఒక ఇంటర్వ్యూలో కల్యాణి తన చిన్నప్పటి జీవితం గురించి చెప్పింది. "నేను, నా సోదరుడు చిన్నప్పుడు అనాథ ఆశ్రమంలో ఉన్నాం. మా నాన్న ప్రియదర్శన్ ధనవంతుడు అయినప్పటికీ మమ్మల్ని ఇలా పెంచారు. ఎందుకంటే డబ్బు, హోదా, లగ్జరీ నుంచి దూరంగా ఉంటేనే జీవిత బాధ్యతలు సరిగ్గా తెలుస్తాయనేది ఆయన ఉద్దేశం. ఆయన నేర్పిన విలువలే మాకు ఈ రోజు ఉపయోగపడుతున్నాయి. అవే మమ్మల్ని ఇండస్ట్రీలో పేరు సంపాదించేటటువంటి మార్గంలో నడిపించాయని ఎమోషనల్‌గా తెలిపారు.