LOADING...
Year Ender 2025: రణ్‌వీర్ సింగ్ నుంచి కమల్ హాసన్ వరకు.. ఈ ఏడాది ట్రోలింగ్‌కు గురైన ప్రముఖ సెలబ్రిటీలు వీరే!
రణ్‌వీర్ సింగ్ నుంచి కమల్ హాసన్ వరకు.. ఈ ఏడాది ట్రోలింగ్‌కు గురైన ప్రముఖ సెలబ్రిటీలు వీరే!

Year Ender 2025: రణ్‌వీర్ సింగ్ నుంచి కమల్ హాసన్ వరకు.. ఈ ఏడాది ట్రోలింగ్‌కు గురైన ప్రముఖ సెలబ్రిటీలు వీరే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2025
06:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 సంవత్సరం సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయికి చేరిందో మరోసారి రుజువు చేసిన ఏడాదిగా నిలిచింది. షార్ట్ వీడియోలు, మీమ్స్‌, థ్రెడ్ చర్చలు, ఏఐ ఆధారిత కంటెంట్ విస్తరణ... ఇవన్నీ కలిసి సెలబ్రిటీలను క్షణాల్లో స్టార్‌లుగా మార్చినట్లే, అదే వేగంతో ట్రోలింగ్స్ కూడా తారా స్థాయికి చేరాయి. సంస్కృతి సున్నితత, వ్యక్తిగత వ్యాఖ్యలు, భాషా భావోద్వేగాలు ఇవన్నీ 2025లో భారీ వివాదాలకు కారణమయ్యాయి. ఈ ఏడాది ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైన ప్రముఖుల జాబితాలో రణ్‌వీర్ సింగ్‌, కమల్ హాసన్‌, రణ్‌వీర్ వంటి పేర్లు ముందువరుసలో నిలిచాయి.

Details

రణ్‌వీర్ సింగ్.. 'కాంతార' వివాదం 

అంతర్జాతీయ చిత్రోత్సవం (IFFI) వేదికగా రణ్‌వీర్ సింగ్ చేసిన ఓ వ్యాఖ్య, అతడిని తీవ్ర విమర్శల మధ్యకు నెట్టింది. కన్నడ చిత్రం 'కాంతార: చాప్టర్ 1'లోని సన్నివేశాన్ని అనుకరిస్తూ చేసిన వ్యాఖ్యలను కొందరు సామాజిక మాధ్యమ వినియోగదారులు, ప్రాంతీయ సంఘాలు సాంస్కృతిక అవమానంగా అభివర్ణించాయి. వివాదం ముదిరిన నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. తన ఉద్దేశం ఎవరి భావోద్వేగాలను దెబ్బతీయడం కాదని స్పష్టం చేశారు.

Details

రణ్‌వీర్ అలహాబాదియా: 'ఇండియాస్ గాట్ లాటెంట్' వివాదం

బీర్‌బైసెప్స్' పేరుతో ప్రసిద్ధి చెందిన పాడ్‌కాస్టర్ రణ్‌వీర్ అలహాబాదియా, 2025లో అత్యధికంగా ట్రోలింగ్‌కు గురైన ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారారు. 'ఇండియాస్ గాట్ లాటెంట్'షోలో ఓ కంటెస్టెంట్‌ను ఉద్దేశించి చేసిన అసభ్య వ్యాఖ్య తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కంటెంట్ నియంత్రణ, ఇన్‌ఫ్లూయెన్సర్ బాధ్యతలపై పెద్ద చర్చ మొదలైంది. "ఇది నా నిర్ణయంలో జరిగిన పొరపాటు అంటూ ఆయన క్షమాపణ చెప్పినా, చట్టపరమైన చిక్కులు తప్పలేదు.

Advertisement

Details

సమయ్ రైనా.. వివాదాస్పద కామెడీ వ్యాఖ్యలు

కామెడీ క్రియేటర్ సమయ్ రైనా కూడా అదే షోలో చేసిన వ్యాఖ్యల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సున్నిత అంశాలపై చేసిన జోకులు అభ్యంతరకరమని విమర్శకులు ఆరోపించారు. వివాదం తీవ్రత పెరగడంతో కొన్ని ఎపిసోడ్‌లు తొలగించాల్సి వచ్చింది. లైవ్ షోలను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యాయపరమైన చర్యలు కూడా ఎదురయ్యాయి. అపూర్వ ముఖిజా.. ఫేమ్ నుంచి ఫైర్‌స్టార్మ్ వరకు 'ది రెబల్ కిడ్'గా ప్రసిద్ధి చెందిన అపూర్వ ముఖిజా కూడా ట్రోలింగ్ వలలో చిక్కుకున్నారు. అదే కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఆమెపై ద్వేష ప్రచారానికి దారి తీశాయి. వ్యాఖ్యల అర్థాన్ని తప్పుగా తీసుకున్నారన్న వాదనల మధ్య,ఆమె తీవ్ర విమర్శలను ఎదుర్కొని క్రమంగా తన ప్రేక్షకులను తిరిగి సంపాదించుకునే ప్రయత్నం చేశారు.

Advertisement

Details

మృణాల్ ఠాకూర్.. బాడీ షేమింగ్ ఆరోపణలు 

నటి మృణాల్ ఠాకూర్‌పై పాత ఇంటర్వ్యూ క్లిప్ ఒకటి వైరల్ కావడం మరో వివాదానికి కారణమైంది. తన ప్రారంభ టీవీ రోజులలో చేసిన వ్యాఖ్యల్లో నటి బిపాషా బసు శరీర నిర్మాణంపై చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు బాడీ షేమింగ్‌గా విమర్శించారు. దీనిపై మృణాల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్షమాపణ చెప్పారు. "19 ఏళ్ల వయసులో చేసిన అమాయక వ్యాఖ్యలు అవి. ఇప్పుడు నా ఆలోచనలు మారాయని పేర్కొన్నారు. బిపాషా బసు కూడా పరోక్షంగా స్పందిస్తూ మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని సూచించే పోస్టు చేశారు.

Details

దిల్జిత్ దోసాంఝ్.. 'సర్దార్ జీ 3' కాస్టింగ్ వివాదం 

పంజాబీ స్టార్ దిల్జిత్ దోసాంఝ్ నటించిన 'సర్దార్ జీ 3'లో పాకిస్థానీ నటి హానియా ఆమిర్‌ను ఎంపిక చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. బహిష్కరణ పిలుపులు వెల్లువెత్తడంతో సినిమా భారత్‌లో విడుదల కాకుండా విదేశాల్లో మాత్రమే ప్రదర్శనకు వచ్చింది. దిల్జిత్ తన సినిమా షూటింగ్ టైమ్‌లైన్‌ను వివరిస్తూ, సహనటిపై తన గౌరవాన్ని వ్యక్తం చేశారు.

Details

 కమల్ హాసన్.. భాషా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం 

ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు 2025లో అత్యంత తీవ్ర వివాదానికి దారి తీశాయి. తన చిత్రం 'థగ్ లైఫ్' ప్రచారంలో కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందన్న వ్యాఖ్యలు కన్నడ సంఘాల ఆగ్రహానికి కారణమయ్యాయి. కర్ణాటకలో నిరసనలు, పోస్టర్ల దహనం చోటుచేసుకున్నాయి. బెంగళూరు కోర్టు కూడా ఆయన వ్యాఖ్యలపై ఆంక్షలు విధించింది. క్షమాపణ చెబితేనే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలన్న డిమాండ్లు వినిపించాయి. తర్వాత కమల్ హాసన్ స్పందిస్తూ, తన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు.

Advertisement