Loading...
upcoming movies telugu: తమ్ముడు నుంచి జిగ్రీస్ వరకు.. ఈ వారం విడుదలయ్యే సినిమాలివే! 
తమ్ముడు నుంచి జిగ్రీస్ వరకు.. ఈ వారం విడుదలయ్యే సినిమాలివే!

upcoming movies telugu: తమ్ముడు నుంచి జిగ్రీస్ వరకు.. ఈ వారం విడుదలయ్యే సినిమాలివే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 30, 2025
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

వివిధ శైలుల కథాంశాలతో జులై 4న ప్రేక్షకుల ముందుకు మూడు చిత్రాలు రాబోతున్నాయి. కుటుంబ అనుబంధాలు, క్రీడా నేపథ్యం, సైన్స్‌ ఫిక్షన్‌, ఎమోషనల్ డ్రామాల మేళవింపుతో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. అక్క తమ్ముడి బంధంతో 'తమ్ముడు' నితిన్‌, సప్తమి గౌడ జంటగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'తమ్ముడు'. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు. లయ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 4న విడుదల కానుంది. అక్క తమ్ముడి అనుబంధంతో నడిచే ఈ కథలో క్రీడా అంశాల మేళవింపు ఉంది. నితిన్‌ ఈ చిత్రంలో ఆర్చరీ క్రీడాకారుడిగా కనిపించబోతున్నారు.

Details

జురాసిక్‌ సిరీస్‌కు కొత్త అధ్యాయం - 'జురాసిక్‌ వరల్డ్‌ రీబర్త్‌' 

పిల్లలతో పాటు పెద్దలకు ఆకర్షణగా నిలిచిన 'జురాసిక్‌ వరల్డ్‌' సిరీస్‌కి ఇది ఏడో భాగం. 'జురాసిక్‌ వరల్డ్‌ డొమినియన్‌'కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జురాసిక్‌ వరల్డ్‌ రీ బర్త్‌' అనే పేరు పెట్టారు.

గరేత్‌ ఎడ్వర్డ్స్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో స్కార్లెట్‌ జాన్సన్‌, జోనాథన్‌ బెయిలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

జులై 4న ఇది ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది.

'ఇది ఓ కొత్త యుగానికి నాంది. జురాసిక్‌ ప్రపంచంలోని కొత్త మాయల కోసం సిద్ధంగా ఉండండి అని చిత్ర బృందం చెబుతోంది.

Details

ఇంటిల్లిపాదినీ అలరించే '3 బీహెచ్‌కే' 

'బొమరిల్లు' ఫేమ్ సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రలో శ్రీగణేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం '3 బీహెచ్‌కే'. శరత్‌కుమార్‌, దేవయాని, యోగిబాబు వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాను అరుణ్‌ విశ్వ నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం జులై 4న విడుదల కానుంది.

కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో మీఠా రఘునాథ్‌, చైత్ర నటించారు.

ADVERTISEMENT

Details

అమెజాన్ ప్రైమ్ వీడియో

హెడ్ ఆఫ్ స్టేట్ (మూవీ) జులై 2

ఉప్పు కప్పురంబు (మూవీ) జులై 4

నెట్‌ఫ్లిక్స్

బిచ్ వర్సెస్ రిచ్ (వెబ్ సిరీస్ : సీజన్ 2) జులై 3

ది శాండ్ మ్యాన్ (వెబ్ సిరీస్: సీజన్ 2) జులై 3

జియో హాట్ స్టార్

క్యాంపైన్ (మూవీ) జూన్ 30

గుడ్ వైఫ్ ( వెబ్ సిరీస్) జులై 4

ఈటీవీ విన్

ఎయిర్ : ఆల్ ఇండియా ర్యాంకర్స్ (వెబ్ సిరీస్) జులై 4

ADVERTISEMENT