Deepika Padukone: పుకార్లకు ఫుల్‌స్టాప్.. భర్తతో కలిసి ముంబైలో సందడి చేసిన దీపిక
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ దీపికా పదుకొణె - రణవీర్ సింగ్ తాజాగా లంచ్ డేట్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలున్నాయంటూ వస్తున్న పుకార్లకు ఈ జంట తన ప్రదర్శనతోనే చెక్ పెట్టింది. ముంబైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు లంచ్ కోసం వచ్చిన ఈ జంట అభిమానులను ఖుషీ చేసింది. ఇదే సమయంలో రణవీర్ నటించిన ధురంధర్ ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న తరుణంలో వీరిద్దరూ కలిసి కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వివరాలు
పుకార్లకు తెరదించిన దీపిక
రణవీర్ సినిమా సక్సెస్‌పై దీపిక సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయకపోవడం, అలాగే 'ధురంధర్ 2' స్పెషల్ షోకు హాజరు కాకపోవడంతో నెటిజన్లలో అనుమానాలు పెరిగాయి. ఇద్దరి మధ్య ఏదో జరిగిందన్న పుకార్లు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా భర్తతో కలిసి లంచ్‌కు వచ్చిన దీపిక తన చిరునవ్వుతోనే ఆ వార్తలన్నింటికీ తెరదించింది. రణవీర్ సాధించిన విజయంపై తన గర్వాన్ని ఆమె హావభావాలు స్పష్టంగా తెలియజేశాయి.
వివరాలు
అభిమానుల సందడి
ఇదిలా ఉండగా, రెస్టారెంట్ బయటకు వచ్చిన రణవీర్‌ను అభిమానులు 'బబ్బర్ షేర్' అంటూ నినాదాలతో ముంచెత్తారు. సినిమాలో ఆయన పోషించిన పవర్‌ఫుల్ పాత్ర పేరుతో అభిమానులు పిలవడం విశేషం. ఈ సందర్భంగా దీపిక కూడా ఆనందంతో మురిసిపోతూ కనిపించింది. తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్న రణవీర్, ఈ విజయాన్ని భార్యతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు కనిపించింది.