Gaddar awards 2026: గద్దర్ అవార్డ్స్ లిస్ట్ రిలీజ్.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు
ఈ వార్తాకథనం ఏంటి
2025 సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన గద్దర్ అవార్డ్స్‌ను శనివారం ప్రకటించారు. అగ్ర నటుడు చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు ను ప్రకటించారు. అలాగే ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు పైడి జైరాజ్ అవార్డు లభించగా, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు సి. నారాయణ రెడ్డి అవార్డు వరించింది. స్పెషల్ జ్యూరీ అవార్డులను నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రకటించారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికెట్ పొందిన సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లకు ఈ అవార్డులు ప్రకటించారు. ఈ పురస్కారాలను మార్చి 19న జరగనున్న ఉగాది సందర్భంగా ప్రదానం చేయనున్నారు.
Details
స్పెషల్ అవార్డులు
ఎన్టీఆర్ జాతీయ అవార్డు - చిరంజీవి
పైడి జయరాజ్ అవార్డు - కమల్ హాసన్
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు - అశ్విని దత్
ఏఎన్నార్ అవార్డు - జయసుధ
ఫీచర్ ఫిల్మ్స్ విభాగం
ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం - దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం - ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
ఉత్తమ నటుడు - నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి - రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్)
ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ - తండేల్
ఉత్తమ సోషల్ మెసేజ్ సినిమా - కోర్ట్
ఉత్తమ డాక్యుమెంటరీ -యూనిటీ
Details
ఉత్తమ ప్రజాదరణ చిత్రం - సంక్రాంతికి వస్తున్నాం
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ పరిచయ దర్శకుడు - సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్)
ఉత్తమ బాలల చిత్రం - అనగనగా ఉత్తమ సహాయ నటుడు - శివాజీ (దండోరా)
ఉత్తమ సహాయ నటి - భూమిక (యుఫోరియా)
ఉత్తమ సంగీత దర్శకుడు - మార్క్ రాబిన్ (దండోరా)
ఉత్తమ గాయకుడు - అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ గాయని - సాహితీ (కన్నప్ప)
ఉత్తమ బాలనటుడు - మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
ఉత్తమ కథా రచయిత - గుణశేఖర్ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్‌ప్లే - అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
Details
ఉత్తమ గేయ రచయిత - నందకిశోర్ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
ఉత్తమ ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్ - ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కింధపురి)
ఉత్తమ కొరియోగ్రాఫర్ - సందీప్ (ఛాంపియన్)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ - తోటకర్ణి (ఛాంపియన్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - గోవిందరాజు (అఖండ 2)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - చంద్రకాంత్ (ఛాంపియన్)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ - పీటర్ (ఛాంపియన్)
స్పెషల్ జ్యూరీ అవార్డులు..
శ్రీరాజ్ రాచకొండ (23 ఫిల్మ్)
చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
రోషన్ మేక (ఛాంపియన్)
అనంతిక (8 వసంతాలు)