Loading...
Asia Cup Rising Stars: కోచ్ సలహాతో మారిన ఆట.. భారత్‌పై సెంచరీ బాదిన శ్రీలంక స్టార్
కోచ్ సలహాతో మారిన ఆట.. భారత్‌పై సెంచరీ బాదిన శ్రీలంక స్టార్

Asia Cup Rising Stars: కోచ్ సలహాతో మారిన ఆట.. భారత్‌పై సెంచరీ బాదిన శ్రీలంక స్టార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2026
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో శ్రీలంక-ఏ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం దోహాలో జరిగిన తొలి సెమీఫైనల్‌లో భారత్-ఏపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 41.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయానికి ఓపెనర్లు లసిత్ క్రాస్‌పుల్ (116 నాటౌట్; 107 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), సినెత్ జయవర్దన (105; 70 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌లు కీలకంగా నిలిచాయి. సెంచరీతో మెరిసిన సినెత్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

వివరాలు

గత మ్యాచుల్లో పరుగులేమీ చేయలేదు

గత మూడు మ్యాచ్‌ల్లో పరుగులు చేయలేకపోయినప్పటికీ.. కోచ్ ఇచ్చిన సలహాలతో కీలక సెమీఫైనల్‌లో సెంచరీ సాధించానని సినెత్ తెలిపాడు.

మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ వెనుక ఉన్న కారణాలను వెల్లడించాడు. ''గత మూడు మ్యాచ్‌ల్లో పరుగులు చేయలేదు.

దీంతో సెమీఫైనల్‌లో నాపై కొంత ఒత్తిడి ఉంది. మ్యాచ్‌కు ముందు హెడ్ కోచ్‌తో మాట్లాడాను. నా ఆలోచనా విధానాన్ని మార్చుకోవడంలో ఆయన సహాయపడ్డారు.

కోచ్ సూచనలతో సానుకూల దృక్పథంతో మైదానంలోకి దిగాను. అది నాకు బాగా ఉపయోగపడింది.

వివరాలు

కోచ్ మాటలు నమ్మకాన్ని పెంచాయి

మ్యాచ్‌కు ముందు ఫర్వేజ్ మహరూఫ్‌తో కూడా మాట్లాడాను. నేను పరుగులు చేయాల్సిన సమయం వచ్చిందని ఆయనతో చెప్పాను. కోచ్‌లు కూడా నా ఆటపై నమ్మకం ఉంచాలని సూచించారు.

నా సహజమైన ఆటను నమ్మి ఆడాలని వారు ఇచ్చిన సలహా ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది'' అని సినెత్ పేర్కొన్నాడు. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రత్యేక వ్యూహాలేమీ అనుసరించలేదని సినెత్ వెల్లడించాడు.

సహజమైన శైలిలో బ్యాటింగ్ చేయాలని, ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టాలని జట్టు యాజమాన్యం నాతో పాటు లసిత్ క్రాస్‌పుల్‌కు సూచించింది.

అదే ప్రణాళికతో బరిలోకి దిగి లక్ష్యాన్ని సులభంగా చేరుకున్నాం.

ADVERTISEMENT

వివరాలు

కొంతకాలంగా ప్రత్యేక సాధన

పిచ్ బ్యాటింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉంది. భారత జట్టు బ్యాటింగ్ చేసినప్పుడు కూడా వికెట్ బాగానే ఉంది. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కూడా బ్యాటింగ్‌కు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు.

ముఖ్యంగా లెగ్‌సైడ్‌లో దూకుడుగా ఆడే షాట్లపై కొంతకాలంగా ప్రత్యేకంగా సాధన చేస్తున్నాను. అది కూడా పరుగులు చేయడానికి ఉపయోగపడింది.

మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా.. ఈరోజు సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. మ్యాచ్ గెలిచినందుకు మరింత సంతోషంగా ఉంది'' అని సినెత్ చెప్పుకొచ్చాడు.

ADVERTISEMENT