NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రిలీజ్ కి సిద్దమైపోయిన గాండీవధారి అర్జున: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి 
    తదుపరి వార్తా కథనం
    రిలీజ్ కి సిద్దమైపోయిన గాండీవధారి అర్జున: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి 
    సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గాండీవధారి అర్జున

    రిలీజ్ కి సిద్దమైపోయిన గాండీవధారి అర్జున: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 17, 2023
    03:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగా హీరో వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమాతో ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గని, ఎఫ్ 3 సినిమాల తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న చిత్రమిది.

    ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. గాండీవధారి అర్జున ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

    ప్రస్తుతం ఈ సినిమాకు సెన్సార్ నుండి సర్టిఫికెట్ U/A వచ్చేసింది. అంటే విడుదలకు సిద్ధమైపోయిందన్నమాట.

    సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో ప్రస్తుతం గాండీవధారి అర్జున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది.

    Details

    మనుషులు చేసే తప్పులను చూపించే సినిమా 

    మనుషులు చేసే తప్పుల గురించి గాండీవధారి అర్జున సినిమాలో చెప్పబోతున్నారు. ఆ తప్పు వల్ల భూమికి ఏ విధంగా నష్టం జరగనుందనేది ఇందులో ప్రధాన అంశంగా ఉండనుంది.

    ఏజెంట్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సాక్షి వైద్య, ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. నాజర్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

    శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

    ఇక వరుణ్ తేజ్ తర్వాతి సినిమాల విషయాలకు వస్తే, కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా సినిమాలో నటిస్తున్నాడు. అలాగే శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా చేస్తున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గాండీవధారి అర్జున
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్
    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే  తెలంగాణ
    IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌కి అవకాశం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    గాండీవధారి అర్జున

    వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమా ప్రీ టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్: ఎప్పుడు విడుదల అవుతుందంటే?  వరుణ్ తేజ్
    హాలీవుడ్ స్టైల్ యాక్షన్ తో అదరగొడుతున్న గాండీవధారి అర్జున ప్రీ టీజర్  సినిమా
    వరుణ్ తేజ్ నటిస్తున్న గాండీవధారి అర్జున టీజర్ రిలీజ్ పై అప్డేట్  వరుణ్ తేజ్
    గాండీవధారి అర్జున నుండి మొదటి పాట రిలీజ్: మత్తెక్కించే పాటలో వరుణ్ తేజ్, సాక్షి రొమాన్స్  సినిమా

    సినిమా

    మరో కొత్త యాడ్ షూట్ లో ఎన్టీఆర్: అదిరిపోతున్న కొత్త లుక్  జూనియర్ ఎన్టీఆర్
    ఆకాశంలో నక్షత్రానికి సూపర్ స్టార్ పేరు: మహేష్ అభిమానుల బహుమతి  మహేష్ బాబు
    ఖుషి ట్రైలర్: మరోసారి గీత గోవిందం మాదిరి పాత్రలో విజయ్ దేవరకొండ  విజయ్ దేవరకొండ
    గుంటూరు కారం నుండి మరో పోస్టర్: చొక్కా బటన్లు విప్పేసిన సూపర్ స్టార్  గుంటూరు కారం

    తెలుగు సినిమా

    Happy Birthday Mahesh Babu: ఇప్పటి వరకు రీమేక్ చేయని మహేష్ కెరీర్లోని ఆసక్తికరమైన విషయాలు  మహేష్ బాబు
    గుంటూరు కారం నుండి సర్ప్రైజ్: ఆ సందేహాలను తీర్చేసిన టీమ్  మహేష్ బాబు
    అమెరికాలో ఆర్ఆర్ఆర్ రికార్డును బద్దలు కొట్టనున్న సలార్: ప్రభాస్ స్టామినా గురూ  సలార్
    భోళాశంకర్ విడుదల ఆపాలంటూ కోర్టును అశ్రయించిన డిస్ట్రిబ్యూటర్  చిరంజీవి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025