గాండీవధారి అర్జున మూవీ రివ్యూ: వరుణ్ తేజ్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, రోషిణి ప్రకాష్, విమలా రామన్, అభినవ్ గొమఠం,తదితరులు
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్
సంగీతం: మిక్కీ జే మేయర్
కథ:
భారత కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ బహదూర్, లండన్ లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ కు వెళతారు. ఆయనకు పెన్ డ్రైవ్ ఇవ్వాలని శృతి(రోషిణి ప్రకాష్) ప్రయత్నిస్తుండగా ఆదిత్య రాజ్ బహదూర్ మీద దాడి జరుగుతుంది.
దాంతో ఆదిత్య రాజ్ బహదూర్ కి సెక్యూరిటీ ఆఫీసర్ గా మాజీ 'రా' ఏజెంట్ అర్జున్ (వరుణ్ తేజ్) వస్తాడు. ఐరా (సాక్షి వైద్య) ఆదిత్య రాజ్ బహదూర్ కి సెక్యూరిటీగా ఉంటుంది.
Details
పెన్ డ్రైవ్ లో ఉన్న రహస్యమే కథ
అర్జున్, ఐరా గతంలో ప్రేమించుకుని విడిపోతారు. అయితే ఆదిత్య రాజ్ బహదూర్ మీద దాడి చేయాలనుకుంది ఎవరు? శృతి ఇవ్వాలనుకున్న పెన్ డ్రైవ్ లో ఏముందనేదే కథ.
సినిమా ఎలా ఉందంటే?
సినిమాలో ఎంచుకున్న గ్లోబల్ వార్మింగ్, మెడికల్ వేస్ట్ మొదలగు కాన్సెప్టులు కొత్తగా ఉన్నాయి. సినిమా అంతా ఫారెన్ లొకేషన్లలో జరిగినట్టుగా కనిపించింది. ఏవో కొన్ని సీన్స్ తప్ప ఎక్కువ భాగం మొత్తం విదేశాల్లోనే జరిగింది.
సినిమాలో చెప్పదలచుకున్న పాయింట్ బాగానే ఉన్నా, చెప్పే విధానంలో లోపం కనిపించింది. సినిమా చాలా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. సినిమాకు మేజర్ ప్లస్. వరుణ్ తేజ్, సాక్షి వైద్య మధ్య లవ్ ట్రాక్ చాలా సాధారణంగా ఉంటుంది.
Details
ఎవరెలా చేసారంటే?
వరుణ్ తేజ్ తన పరిధిలో చాలా చక్కగా చేసాడు. 'రా' ఏజెంటుగా సరిగ్గా సరిపోయాడు. యాక్షన్ సీక్వెన్స్ లో ఇరగదీసాడని చెప్పవచ్చు. ఈ సినిమాకు వరుణ్ తేజ్ నటన ప్రధాన బలం.
కేంద్ర మంత్రిగా నాజర్ ఆకట్టుకున్నాడు. సాక్షి వైద్యకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. ఇక మిగతా వారిలో రోషిణి ప్రకాష్, అభినవ్ గొమఠం తమ తమ పాత్రల పరిధుల మేరకు బాగా చేసారు.
ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. తెరమీద ప్రతీ సీన్ ఎంతో క్వాలిటీగా కనిపించింది. సాంగ్స్ కానీ, నేపథ్య సంగీతం కానీ అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు.
ఓవరాల్ గా చూస్తే కథలో పాయింట్ బాగుంది. కథనం ఆసక్తిగా ఉంటే సినిమా మరింత బాగుందేది.