
గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్: నిరాశలో చిరంజీవి అభిమానులు
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా బాక్సాఫీసు దగ్గర రీ రిలీజ్ ల పర్వం నడుస్తోంది. మహేష్ బాబు పోకిరి నుండి మొదలైన ఈ మేనియా, జల్సా, ఖుషి, ఒక్కడు, నారప్ప సినిమాల వరకూ సాగింది.
రీ రిలీజ్ సినిమాలకు కూడా బాక్సాఫీసు కలెక్షన్లు అదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. ఇతర ఇండస్ట్రీల్లో కొత్త సినిమాల రిలీజ్ లకే కలెక్షన్లు లేని సమయాల్లో తెలుగులో రీ రిలీజ్ లకు మంచి వసూళ్ళు తెచ్చుకున్న సినిమాలున్నాయి.
అందుకే రీ రిలీజ్ సినిమాల లిస్ట్ బాగా పెరిగింది. అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ కూడా చేరింది. ఫిబ్రవరి 11వ తేదీన రీ రిలీజ్ అవుతుందని ప్రకటించారు కూడా. కానీ అకస్మాత్తుగా రీరిలీజ్ ఆగిపోయింది.
చిరంజీవి
టెక్నికల్ సమస్యల వల్ల ఆలస్యం అవుతున్న గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్
గ్యాంగ్ లీడర్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నామని ఎప్పుడో ప్రకటన వచ్చింది. ఈ మధ్య బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అభిమానులు గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్ ని సెలెబ్రేట్ చేసుకోవాలని రెడీ ఐపోయారు.
సడెన్ గా రీ రిలీజ్ వాయిదా పడిందని న్యూస్ బయటకు వచ్చింది. టెక్నికల్ సమస్య వల్ల గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్, ఫిబ్రవరి 11వ తేదీన కుదరదని, మరికొంత సమయం కావాలని, మళ్ళీ రీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో తెలియజేస్తామని తెలియజేసారు.
దాంతో మెగాస్టార్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. ప్లానింగ్ లేకుండా రీ రిలీజ్ ఎలా ప్లాన్ చేసారని నిర్వహకుల మీద సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.