LOADING...
Nani: గ్యాంగ్‌లీడర్ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అయ్యే ఛాన్స్.. హీరోయిన్‌గా ప్రియాంకా?
గ్యాంగ్‌లీడర్ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అయ్యే ఛాన్స్.. హీరోయిన్‌గా ప్రియాంకా?

Nani: గ్యాంగ్‌లీడర్ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అయ్యే ఛాన్స్.. హీరోయిన్‌గా ప్రియాంకా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

నాని హీరోగా వచ్చిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా, ప్రియాంకాకు మాత్రం మంచి గుర్తింపు దక్కింది. ఇప్పుడు ఆ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్ టాక్ ప్రకారం, ఓజీ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించనున్న నాని కొత్త సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా కనిపించబోతుందట. ఇప్పటికే ప్రియాంకాతో డిస్కషన్లు పూర్తి అయ్యాయని, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడం మాత్రమే మిగిలి ఉందని సోషల్ మీడియాలో గాసిప్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవలే నాని-సుజిత్ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిసిందే.

Details

అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

ఈ ప్రాజెక్టును 'ఓజీ' స్థాయిని మించేలా ప్లాన్ చేస్తున్నాడని, నానిని పూర్తిగా కొత్త లుక్‌లో, ఇప్పటివరకు చూడని స్టైల్‌లో చూపించాలని సుజిత్ బలంగా నిర్ణయించుకున్నాడని ఇండస్ట్రీ టాక్. అన్ని అనుకున్నట్టే జరిగితే, నాని-ప్రియాంకా జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం ఇది పుకారుగా ఉన్నప్పటికీ, ఈ వార్త మేకర్స్‌కి, అభిమానులకి బాగా హుషారును తెచ్చింది. ఇక నాని ప్రస్తుతం దసరా మూవీ డైరెక్టర్‌తో 'ది ప్యారడైజ్' సినిమా చేస్తున్నాడని తెలిసిందే.