
Alia Bhatt : ఐదు నేషనల్ అవార్డులతో అదరగొట్టిన 'గంగూబాయి కతియావాడి'.. ఉత్తమ నటిగా అలియా భట్
ఈ వార్తాకథనం ఏంటి
'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో సీత పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన బాలీవుడ్ నటి అలియా భట్, మరోసారి తన నటనతో జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గంగూబాయి కతియావాడి' ఏకంగా ఐదు నేషనల్ అవార్డులు సాధించడం విశేషం. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. కరోనా కారణంగా కొంతకాలం వాయిదా పడిన ఈ చిత్రం, 2022లో విడుదల కాగా, థియేటర్లలో అద్భుతమైన స్పందనతో సూపర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఇప్పటికే 50 అవార్డులను సొంతం చేసుకుందన్న విషయాన్ని ఐఎండీబీ (IMDb) వెల్లడించింది.
Details
అవార్డు రావడంపై గర్వకారణం
ఇక నేషనల్ అవార్డుల విభాగంలో ఉత్తమ నటిగా అలియా భట్‌కు లభించిన పురస్కారం గర్వకారణం కాగా, సినిమా ఇతర విభాగాల్లోనూ మెరిసింది. అవి ఈ విధంగా ఉన్నాయి: ఉత్తమ స్క్రీన్‌ప్లే (డైలాగ్ రైటింగ్) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే ఉత్తమ ఎడిటింగ్