Garudan :బెల్లంకొండ హీరోగా వస్తున్న గరుడన్.. నేడు టైటిల్ - ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్న మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ ప్రముఖ హాస్య నటుడు సూరి హీరోగా, సీనియర్ నటుడు శశికుమార్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన చిత్రం 'గరుడన్'.
ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో విజయ్ కనకమేడల రీమేక్ చేస్తున్నారని సమాచారం.
యువ హీరోలైన నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
భారీ బడ్జెట్‌లో కె.కె రాధామోహన్ 'సత్యసాయి ఆర్ట్స్' బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ చిత్రానికి 'భైరవం' అనే టైటిల్‌ను ఖరారు చేసారని చెబుతున్నారు.
వివరాలు
టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నఅతిధి శంకర్
ఈ సినిమా ద్వారా శంకర్ కుమార్తె అతిధి శంకర్ టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు.
ప్రస్తుతం, ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
ఇటీవల ముగిసిన షెడ్యూల్‌లో, దర్శకుడు అతిధి శంకర్ సీన్స్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
'నాంది', 'ఉగ్రం' చిత్రాలను తెరకెక్కించిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ భారీ ముల్టీస్టారర్ రూపుదిద్దుకుంటుంది.
వివరాలు
టైటిల్, ఫస్ట్ లుక్ ఈ రోజు సాయంత్రం
షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ఈ రోజు సాయంత్రం 4:05కి విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
ఈ పోస్టర్‌లో విడుదల తేదీ ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది. దర్శకుడు విజయ్ తెలుగు నేటివిటికి అనుగుణంగా ఈ సినిమాను పర్ఫెక్ట్‌గా మార్చారని, బెల్లంకొండ హిట్ కొడతాడని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తమిళ్ మూవీ 'గరుడన్' రీమేక్..?
తమిళ్ మూవీ 'గరుడన్' రీమేక్..?
— TeluguOne (@Theteluguone) November 4, 2024
ప్రధాన పాత్రలలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్..?#Garudan #VijayKanakamedala #NaraRohit #ManchuManoj #BellamkondaSrinivas pic.twitter.com/UVEWEgVoOf