Geetha Madhuri: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి
టాలీవుడ్ సింగర్ గీతా మాధురి- నటుడు నందు దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ బిడ్డ వీరికి రెండో సంతానం. ఈ విషయాన్ని స్వయంగా గీతా మాధురి స్వయంగా వెల్లడించారు. ఫిబ్రవరి 10న తమకు కుమారుడు పుట్టాడని ఇన్‌స్టా స్టోరీలో గీత పేర్కొన్నారు. దీంతో అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 2014లో సింగర్ గీతా మాధురి, హీరో నందు ప్రేమ వివాహం చేసుకున్నారు. 2019లో మొదటి సంతానంగా దాక్షాయణి ప్రకృతి జన్మించింది. టాలీవుడ్‌లో గీతా మాధురి ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్‌ను పాడింది. ఇటీవల గీతా మాధురి సీమంతం జరగ్గా.. ఆ ఈమెంట్ ఫొటోలు వైరల్‌గా మారాయి.