Page Loader
Genelia : జెనీలియా మళ్లీ వెండితెరపైకి.. కారణం ఇదే! 
జెనీలియా మళ్లీ వెండితెరపైకి.. కారణం ఇదే!

Genelia : జెనీలియా మళ్లీ వెండితెరపైకి.. కారణం ఇదే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2025
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

జెనీలియా ద‌ర్శ‌క‌ప్ర‌పంచానికి చేసిన రీ ఎంట్రీ అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. పెళ్లయ్యాక చాలా మంది హీరోయిన్లు కొంతకాలం గ్యాప్ తీసుకునే రీ‌తిలో, జెనీలియా మాత్రం తన గ్యాప్‌ను ఎంతో అర్థవంతంగా ఉపయోగించుకుంది. దాదాపు దశాబ్దకాలం తర్వాత ఆమె బాలీవుడ్‌లో 'సితారే జమీన్ పర్' అనే సినిమాతో తిరిగి వెండితెరపై కనిపించగా, దక్షిణాది ప్రేక్షకులకు మాత్రం 'జూనియర్' అనే చిత్రంతో మళ్లీ పరిచయమైంది. తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన జెనీలియా ఇన్నేళ్ల తర్వాత తిరిగి స్క్రీన్‌ మీదకి రావడం ఆసక్తికర విషయం. ఇటీవలి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విరామానికి తన కుటుంబమే ప్రధాన కారణమని చెప్పింది. ' పెళ్లి తర్వాత భర్తకు సమయం ఇవ్వాలి, పిల్లలకు తగినంత శ్రద్ధ చూపాలి.

Details

కేరీర్ పై దృష్టి సారించిన జెనీలియా

ఏ పని మొదలుపెడితే దాన్ని పూర్తిచేయాలి అనే ఆలోచనతో ఫ్యామిలీకే నా సమయాన్ని కేటాయించాను. ఇప్పుడు నా పిల్లలు స్వయంగా వారి పనులు చేసుకోగలుగుతున్నారు కాబట్టి, మళ్లీ నా కెరీర్‌పై దృష్టి పెట్టే సమయం వచ్చిందనిపిస్తోందని వెల్లడించింది. ఈ గ్యాప్‌లో జెనీలియా కేవలం గృహిణిగానే పరిమితం కాలేదు. వ్యాపారవేత్తగా, నిర్మాతగా కూడా తన సత్తా చాటింది. ఓ ఫుడ్ కంపెనీని ప్రారంభించి విజయవంతంగా నడిపింది. ఇప్పుడు తన పిల్లలు కొంత పెద్దవారవడంతో మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. 'జూనియర్' సినిమాలో ఆమె నటనకు మంచి స్పందన లభిస్తోంది. ఇకపై పూర్తిస్థాయిలో సినిమాలపై దృష్టి పెడతానని చెప్పి అభిమానులకు మంచి వార్త చెప్పింది.