Trisha: నచ్చిన వ్యక్తి దొరికితేనే పెళ్లి.. లేదంటే సింగిల్‌గానే జీవితం!
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాది సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా కొనసాగుతున్న త్రిష తన నటన, అందంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా పెళ్లి గురించి, తరచూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా పెళ్లి, విడాకులు, సహజీవనం వంటి అంశాలపై త్రిష గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో 'మీ పెళ్లి ఎప్పుడు?' అనే ప్రశ్నకు త్రిష స్పష్టంగా స్పందించారు. చాలామంది నన్ను పెళ్లి గురించి అడుగుతుంటారు. కానీ నాకు ఒకటే సమాధానం ఉంది. నాకు నచ్చిన, సరైన వ్యక్తి దొరికితేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే పెళ్లి జరగకపోయినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
Details
తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు
ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటే అది విడాకుల వరకు వెళ్లకూడదని భావిస్తున్నాను. అందుకే తొందరపడి ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోనని ఆమె వివరించారు. పెళ్లి అనేది కేవలం సమాజం కోసం తీసుకునే నిర్ణయం కాదని, జీవితాంతం కలిసి జీవించగలమనే నమ్మకం కలిగినప్పుడే ఆ అడుగు వేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. నా స్నేహితుల్లో చాలా మంది ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని బాధపడుతున్నారు. అలాంటి జీవితం నాకు వద్దు.ఇష్టం లేని వ్యక్తితో కలిసి నరకం అనుభవించడం కంటే ఒంటరిగా ఉండటం మేలని త్రిష స్పష్టం చేశారు. ప్రేమలో పడటానికి కంటే తన జీవితాన్ని పంచుకోగలిగే ఒక మంచి భాగస్వామి కావాలని,తనకు నచ్చిన వ్యక్తితో కలిసి జీవించడమే తనకు ముఖ్యమని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.