LOADING...
Girija Oak: న్యూనేషనల్ క్రష్‌గా గిరిజా ఓక్.. యూట్యూబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్లపై గుల్షన్ దేవయ్య ఆసక్తికర వ్యాఖ్యలు! 
న్యూనేషనల్ క్రష్‌గా గిరిజా ఓక్.. యూట్యూబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్లపై గుల్షన్ దేవయ్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Girija Oak: న్యూనేషనల్ క్రష్‌గా గిరిజా ఓక్.. యూట్యూబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్లపై గుల్షన్ దేవయ్య ఆసక్తికర వ్యాఖ్యలు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒక్క ఇంటర్వ్యూతో హాట్ టాపిక్‌గా మారిపోయిన ముద్దుగుమ్మ 'గిరిజా ఓక్'. ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ క్రేజ్ అందుకుంటోంది. గతంలో హీరోయిన్‌గా ఆకట్టుకున్న ఆమెకు ఇప్పుడు మరింత ప్రజాదరణ లభిస్తోంది. ముఖ్యంగా స్లీవ్‌లెస్ బ్లౌజ్, చీరలోని బ్లూ శారీ ఫొటోలను ఇంటర్వ్యూలో చూసిన నెటిజన్లు ఆమె అందానికి ఘాటైన ఫిదా అయ్యారు.

Details

న్యూనేషనల్ క్రష్‌గా గిరిజా ఓక్

సోషల్ మీడియాలో గిరిజా ఓక్‌ను న్యూనేషనల్ క్రష్‌గా ట్రెండ్ చేస్తూ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఇదే సమయంలో, ఆమెతో కలిసి చేసిన ఇంటిమేట్ సీన్ల గురించి 'కాంతార చాప్టర్ 1' నటుడు గుల్షన్ దేవయ్య చెప్పిన ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో ఉన్న డ్రామా వెబ్ సిరీస్ 'పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ'లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. మనోజ్ పహ్వా, సీమా పహ్వా, గుల్షన్ దేవయ్య, కావేరి సేథ్, నేహా ధూపియా, హిర్వ త్రివేది, రొనావ్ వాస్వానీ తదితరులు ఇందులో నటించారు. నవంబర్ 28 నుంచి యూట్యూబ్‌లో ప్రసారం అవుతున్న ఈ సిరీస్‌కు సచిన్ పాఠక్ దర్శకత్వం వహించగా, పాలక్ భాంబ్రి క్రియేట్ చేశారు.

Details

గిరిజాతో ఇంటిమేట్ సీన్స్‌పై గుల్షన్ కీలక వ్యాఖ్యలు

పంకజ్ త్రిపాఠి-జార్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ఈ సిరీస్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సిరీస్‌లో భార్యాభర్తలుగా నటించిన గుల్షన్ దేవయ్య-గిరిజా ఓక్ మధ్య కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గుల్షన్ ఆ సన్నివేశాలపై స్పందిస్తూ "ఇలాంటి సీన్లు చేయడం నిజంగా చాలా క్లిష్టం. ఎందుకంటే దాటకూడని ఒక గీత ఎప్పుడూ ఉంటుంది. హద్దులు దాటకుండా సాన్నిహిత్యాన్ని నిజంగా ఉన్నట్టుగా చూపించాలి. అందుకే ఇటువంటి దృశ్యాలను అత్యంత బాధ్యతాయుతంగా చిత్రీకరించడానికి మార్గాలు వెతకాలని అన్నారు.

Advertisement

Details

ఇంటిమసీ కో-ఆర్డినేటర్ల పాత్ర

ఇలాంటి సన్నివేశాలకు ఈ రోజుల్లో ఇంటిమసీ కో-ఆర్డినేటర్లు అందుబాటులో ఉంటారని గుల్షన్ వివరించారు. ఉల్జా సినిమా షూట్ సమయంలో యూకేకు చెందిన ఒక ఇంటిమసీ కో-ఆర్డినేటర్ ఉండేవారు. ఆమె ప్రతి దశలో మాకు మార్గనిర్దేశం చేశారు. అందరికీ సౌకర్యంగా ఉండేలా చూసుకున్నారు. అయితే ఆ సన్నివేశాల్లో మూడో వంతు చివరికి కట్ అయిపోయింది. ఫైనల్ వెర్షన్‌లో పెద్దగా ఏమీ మిగల్లేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటాయని ఆయన చెప్పారు.

Advertisement

Details

పాత రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేది?

గుల్షన్ దేవయ్య 2012లో జరిగిన 'హేట్ స్టోరీ' షూటింగ్‌ను గుర్తుచేసుకున్నారు. అప్పుడు ఇంటిమసీ కో-ఆర్డినేటర్లు లాంటి సపోర్ట్ ఎవ్వరూ ఉండేవారు కాదు. అన్ని విషయాలను స్వయంగా నేర్చుకోవాల్సి వచ్చేది. అదృష్టవశాత్తూ పాయోలీ దామ్‌తో పనిచేశాను. ఆమె ఎంతో సహకరించారు; నేను సౌకర్యంగా ఉండేలా చూసుకున్నారని అన్నారు. 'కాంతార చాప్టర్ 1'లో గుల్షన్ దేవయ్య 'పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ'కి ముందు గుల్షన్ దేవయ్య దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన 'కాంతార చాప్టర్ 1'లో నటించారు. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఆ పౌరాణిక యాక్షన్ డ్రామాలో గుల్షన్ దుష్ట రాజు కులశేఖర పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Advertisement