LOADING...
Girija Oak : ఒక ఇంటర్వ్యూతోనే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన గిరిజ ఓక్‌.. ఆమె ఎవరంటే?
ఒక ఇంటర్వ్యూతోనే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన గిరిజ ఓక్‌.. ఆమె ఎవరంటే?

Girija Oak : ఒక ఇంటర్వ్యూతోనే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన గిరిజ ఓక్‌.. ఆమె ఎవరంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2025
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో ఎవరూ ఊహించలేరు. ఒక చిన్న వీడియో, ఒక డైలాగ్, ఒక డ్యాన్స్‌, లేదా ప్రియా వారియర్‌లాగా ఒక నవ్వుతో కూడా ఒక్కసారిగా స్టార్‌గా మారిపోవచ్చు. ప్రస్తుతం అలాంటి వైరల్ ఫేమ్‌ అందుకున్నది నటి గిరిజ ఓక్. రెండు రోజులుగా ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సింపుల్‌గా చీరలో కనిపించిన గిరిజ ఓక్‌ అందం అందరినీ ఆకట్టుకుంటోంది. మరాఠీ, హిందీ సినిమా పరిశ్రమలకు చెందిన ఈ నటి ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొంది. అందంగా కనిపించడం మాత్రమే కాకుండా, నటుడు గుల్షన్ దేవయ్య గురించి పొగడ్తలు పలికింది. సరదాగా మాట్లాడిన తీరు, ఆత్మవిశ్వాసం నిండిన సమాధానాలు వైరల్ అయ్యాయి.

Details

గిరిజ ఓక్ ఎవరు?

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన గిరిజ ఓక్‌ డిగ్రీ పూర్తయ్యాక నాటకరంగంలో అడుగుపెట్టింది. థియేటర్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సాధిస్తూ పలు యాడ్‌ ఫిల్మ్‌లలో నటించింది. ఆ తర్వాత మరాఠీ, హిందీ సీరియల్స్‌, సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఆమె నటించిన ప్రముఖ సినిమాల్లో 'తారే జమీన్ పర్', 'జవాన్', 'షోర్ ఇన్ ది సిటీ' ఉన్నాయి. అలాగే 'కార్టెల్', 'మోడ్రన్ లవ్ ముంబై' వంటి వెబ్‌సిరీస్‌లలోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. త్వరలో 'థెరఫీ షెరఫీ' అనే సిరీస్‌లో కనిపించనుంది.

Details

వైరల్ కావడానికి కారణమిదే 

2007 నుండి ఇండస్ట్రీలో ఉన్నా పెద్దగా గుర్తింపు రాకపోయిన గిరిజ ఓక్‌కి ఇప్పుడు ఒక్క ఇంటర్వ్యూతోనే జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. స్కై బ్లూ కలర్‌ చీర, స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌తో ఆత్మవిశ్వాసంగా మాట్లాడిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఆ లుక్‌తో ఆమె సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. దేశవ్యాప్తంగా గిరిజ ఓక్ ట్రెండ్ అవుతుండగా, ఆమె ఫాలోవర్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

Details

వ్యక్తిగత జీవితం

ప్రస్తుతం 37 ఏళ్ల వయస్సు కలిగిన గిరిజ ఓక్, మరాఠా సీనియర్ నటుడు శ్రీరంగ్ గాడ్బోలే కుమారుడు సుహృద్ గాడ్బోలేను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక బాబు ఉన్నాడు. సోషల్ మీడియాలో గిరిజ ఓక్ తరచుగా సింపుల్‌గా చీరల్లో ఫొటోలు పంచుకుంటూ అభిమానులతో కనెక్ట్‌గా ఉంటుంది. ఇక ఈ వైరల్‌ ఫేమ్‌ తర్వాత గిరిజ ఓక్‌కి మరిన్ని పెద్ద అవకాశాలు దక్కుతాయేమో చూడాలి.