The Paradise Glimpse: కడుపు మండిన కాకుల కథ.. నాని 'ప్యారడైజ్' గ్లింప్స్ అదిరింది!
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. 'దసరా'తో మాస్ అవతార్‌లో అలరించిన నాని, ఇప్పుడు మరింత యాక్షన్ ప్యాక్డ్ సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం 'హిట్ 3' చిత్రంలో నటిస్తుండగా, తాజాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న 'ప్యారడైజ్' గ్లింప్స్‌ను విడుదల చేశారు.
గ్లింప్స్‌లోనే బూతుల వార్నింగ్!
ఈ వీడియో ప్రారంభంలోనే 'బూతులు కూడా ఉంటాయి' అని స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు. 'ప్యారడైజ్' ప్రపంచం ఎలా ఉండబోతుందో ముందే చూపించారు.
వీడియో మొత్తంలో కాకుల రిఫరెన్స్‌లు గట్టిగా ఉండటంతో ఇది ఓ విభిన్నమైన కథగా అనిపిస్తోంది.
Details
పిల్లల కోసం పాలు కాదు.. రక్తం పెంచిన ఓ జాతి కథ!
ఇది కడుపుమండిన కాకుల కథ.. జమానా జమానా కెల్లి నడిచే శవాల కథ.. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పెంచి పోసిన ఓ జాతి కథ" అంటూ గ్లింప్స్‌లో వచ్చే పవర్‌ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది.
నాని కొత్త లుక్ - పిలక, చైన్లు, గన్స్!
ఈ వీడియోలో నాని ఫేస్‌ను పూర్తిగా చూపించకపోయినా, పిలకలు వేసుకుని, మెడలో చైన్లు, చేతిలో గన్స్‌తో పూర్తిగా వైవిధ్యమైన లుక్‌లో కనిపించాడు.
ఇది 'దసరా' కంటే కూడా డార్క్, ఇన్‌టెన్స్ మూవీగా ఉండేలా కనిపిస్తోంది.
Details
తల్లి పాత్రలో సోనాలి కులకర్ణి
ఈ చిత్రంలో నాని తల్లిగా సీనియర్ నటి సోనాలి కులకర్ణి నటించనుంది. సినిమా నేపథ్యం ఒకప్పటి సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.
అదనంగా ఇందులో హీరోయిన్ పాత్ర లేకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మూవీకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచంద్రన్ పనిచేస్తున్నాడు.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే విభిన్నంగా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ గ్లింప్స్‌తో 'ప్యారడైజ్'పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి, నాని ఈ కొత్త మాస్ అవతార్‌లో ఎంతవరకు విజయాన్ని అందుకుంటాడో చూడాలి!