తదుపరి వార్తా కథనం
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మేడమ్ టుస్సాడ్స్‌లో అరుదైన గౌరవం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 22, 2024
05:13 pm
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన ఘనతను సాధించాడు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం కొలువుదీరనుంది.
అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు.
2025 వేసవి సమయానికి చరణ్ విగ్రహాన్ని సందర్శన కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు.
మేడమ్ టుస్సాడ్స్‌లో ఉన్న 'ఐఐఎఫ్‌ఏ జోన్'లో ఇప్పటికే షారుక్, అమితాబ్ బచ్చన్, కాజోల్, కరణ్ జోహార్‌ల మైనపు విగ్రహాలు ఉన్నాయి.