Priyanka Chopra: 'గ్లోబ్‌ట్రాటర్'తో తెలుగు తెరపై దుమ్మురేపనున్న ప్రియాంక చోప్రా!
ఈ వార్తాకథనం ఏంటి
తన తెలుగు సినిమా పునరాగమనం ఘనంగా సాగుతోందని ప్రియాంక చోప్రా ఆనందం వ్యక్తం చేసింది. తాను కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం "గ్లోబ్‌ట్రాటర్" గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులు తప్పక ఇష్టపడతారని చెప్పి అభిమానుల ఉత్సాహాన్ని పెంచింది. అంతర్జాతీయంగా పేరు సంపాదించిన ప్రియాంక ప్రస్తుతం మహేష్ బాబు.. ఎస్.ఎస్.రాజమౌళి కలయికలో రూపొందుతున్న చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. "గ్లోబ్‌ట్రాటర్" అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన వేడుక ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో పంచుతున్న అప్‌డేట్లు సినీప్రియులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
వివరాలు
ఇవి రెండూ నా జీవితాన్ని మార్చే అనుభవాలు
బుధవారం ప్రియాంక చోప్రా ఎక్స్ (Twitter)లో అభిమానులతో చాట్ నిర్వహించింది. ఆ సందర్భంగా ఆమె "అదిరింది... ఆకలేస్తోంది..." అంటూ తీయని తెలుగు మాటలతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా తన కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైందని, కానీ సినిమా మాత్రం అద్భుతంగా వచ్చిందని ఆమె చెప్పింది. ఒక అభిమాని - "తెలుగు మాట్లాడటం కష్టమా? లేక రాజమౌళి గారి ఇంటెన్స్ షూటింగ్ షెడ్యూల్‌నా?" అని అడగగా, ప్రియాంక నవ్వుతూ "రెండూ కష్టంగా అనిపించలేదు... కానీ ఇవి రెండూ నా జీవితాన్ని మార్చే అనుభవాలు" అని సమాధానం ఇచ్చింది.
వివరాలు
ఫామ్‌హౌస్‌లో ఉన్న దూడతో ఆడుకున్న క్షణాలు మా జీవితంలో మధురమైన జ్ఞాపకం
ఈ మధ్యకాలంలో ప్రియాంక ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటోంది. ఆ విషయంపై మాట్లాడుతూ.. "నా కూతురు హైదరాబాద్ వాతావరణానికి పూర్తిగా అలవాటు అయిపోయింది. మహేశ్, నమ్రత, వాళ్ల కూతురు సితారతో కలిసి బాగా గడుపుతోంది. రాజమౌళి గారి ఫామ్‌హౌస్‌లో ఉన్న దూడతో ఆడుకున్న క్షణాలు మా జీవితంలో మధురమైన జ్ఞాపకం" అని చెప్పింది.
వివరాలు
ఎన్నెన్నో కోణాలు..
ఈ చిత్రంలో ప్రియాంక మందాకిని అనే శక్తివంతమైన పాత్రలో కనిపించబోతోంది. ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను బుధవారం దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. అందులో భారతీయ సొగసును ప్రతిబింబించే చీరకట్టుతో, చేతిలో గన్ పట్టుకుని ఉన్న ప్రియాంక లుక్ ఆకట్టుకుంది. రాజమౌళి మాట్లాడుతూ.. "మందాకిని పాత్రలో అనేక కోణాలు,లోతైన భావాలు ఉన్నాయి. ఈ పాత్ర ద్వారా ప్రియాంక మరోసారి తన నటనతో ప్రపంచ వేదికపై భారతీయ సినిమాకి కొత్త నిర్వచనం ఇస్తుంది. ఆమె మన దేశీ అమ్మాయి.. ప్రపంచాన్ని గర్వపడేలా చేసిన మహిళ" అంటూ ప్రియాంక చోప్రాకు ఘన స్వాగతం పలికారు.