నాగార్జునకు నోటీసులిచ్చిన గ్రామ సర్పంచ్
సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు నార్త్ గోవాలోని మండ్రెమ్ గ్రామ సర్పంచ్ నోటీసులు ఇచ్చారు. పనులను ఆపాలంటూ పంచాయతీ కార్యాలయం నుండి నాగార్జునకు నోటీసు వచ్చింది. మండ్రెమ్ సమీపంలోని అశ్వేవాడ గ్రామంలో ఎలాంటి అనుమతి బోర్డులు లేకుండా నిర్మాణ పనులు, తవ్వకాలు జరుపుతున్నందు వల్ల నోటీసులు వచ్చాయని తెలుస్తోంది. మండ్రెమ్ గ్రామ సర్పంచ్ అమిత్ సావంత్ ఈ నోటీసులను జారీ చేసారు. అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారంటూ 1994 గోవా పంచాయితీ చట్టం కింద ఈ నోటీసులు నాగార్జునకు వచ్చాయి. గ్రామ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణ పనులు, తవ్వకాలు చేపడుతున్నందున, పనులు ఆపాలని కొనసాగించరాదని తెలియజేస్తూ నోటీసులు ఇష్యూ చేసారు.
యాక్టర్ అని తెలియదు
అశ్వేవాడ గ్రామంలో సర్వే నంబర్ 211/2 B లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని, తవ్వకాలు ప్రారంభించారని ఆ నోటిసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సర్పంచ్ అమిత్ సావంత్ మాట్లాడుతూ, కొండ ప్రాంతంలో తవ్వకాలు జరిగాయి, ఆయన యాక్టర్ అన్న విషయం మాకు తెలీదని అన్నాడు. ఈ విషయమై నాగార్జున ఎలా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం నాగార్జున కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఘోస్ట్ పేరుతో సినిమా రిలీజై ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే నాగార్జున గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు 4 బిగ్ బాస్ సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున, 7వ సీజన్ కి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.