NBK111 : బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. NBK111 టైటిల్‌పై క్లారిటీ వచ్చేది అప్పుడే!
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ NBK111. 'వీరసింహారెడ్డి' వంటి సూపర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ప్రారంభం నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి టాలీవుడ్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా అధికారిక టైటిల్‌తో పాటు థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 6న అధికారికంగా వెల్లడించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి 'GOD', 'DADA' (దాదా)అనే రెండు మాస్ క్యాచీ టైటిల్స్‌ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
వివరాలు
పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మంచు మనోజ్
బాలయ్య ఇమేజ్‌కు, గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్ డ్రామాకు ఈ రెండు టైటిల్స్ పర్ఫెక్ట్‌గా సరిపోతాయని భావిస్తున్నారు.
అయితే 'దాదా' టైటిల్‌ను దాదాపు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టార్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
షూటింగ్ సమయంలో బాలకృష్ణ గాయపడటంతో మేకర్స్ షూటింగ్‌కు కొంత గ్యాప్ ఇచ్చారు.
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.
ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మంచు మనోజ్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
వివరాలు
త్వరలోనే రిలీజ్ డేట్ పై స్పష్టత వచ్చే అవకాశం
ఈ సినిమాను డిసెంబర్ మూడో వారంలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.
అయితే సెప్టెంబర్ 6న రానున్న అధికారిక ప్రకటనతో సినిమా టైటిల్, థియేట్రికల్ రిలీజ్ డేట్‌పై పూర్తి స్పష్టత రానుంది.