AA 22 : బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టైటిల్ రివీల్‌కు తేదీ ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) వేడుకలు ఈసారి ఒక రోజు ముందుగానే జోష్‌తో ప్రారంభమయ్యాయి. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన బన్నీ-అట్లీ కాంబినేషన్ సినిమాపై ఈరోజు కీలక ప్రకటన రానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. బన్నీ బర్త్‌డే స్పెషల్‌గా, ఒక రోజు ముందే అభిమానులకు ఈ ట్రీట్ ప్లాన్ చేశారు. AA 22 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్లు సమాచారం.
వివరాలు
హీరోయిన్‌గా దీపికా పదుకొణె
అట్లీ స్టైల్‌లో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భారీ వీఎఫ్‌ఎక్స్ ఉండనున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాకు 'అయాన్', 'లెగసీ' వంటి టైటిల్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఫైనల్ టైటిల్ ఏదో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జవాన్ వంటి భారీ హిట్ ఇచ్చిన అట్లీ, ఇప్పుడు అల్లు అర్జున్‌ను ఏ స్థాయిలో ప్రెజెంట్ చేస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటిస్తుండగా, కీలక పాత్రల్లో మృణాల్ ఠాకూర్, జాన్వి కపూర్ కనిపించనున్నట్లు టాక్. ఇక సంగీతాన్ని కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. మొత్తంగా, బన్నీ-అట్లీ కాంబో ఏ కథతో వస్తుంది? ఏ టైటిల్ ఫిక్స్ అవుతుంది? అన్నదానిపై అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.