Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'మన శంకర వర ప్రసాద్ గారు' ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్!
ఈ వార్తాకథనం ఏంటి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, ప్రమోషనల్ కంటెంట్ సూపర్ హిట్ బజ్‌ను క్రియేట్ చేసి, అభిమానుల్లో పెద్ద ఎక్సైట్‌మెంట్‌ను రేకెత్తించాయి. తాజాగా చిత్ర యూనిట్ నుంచి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. 150 సెకన్ల (2 నిమిషాల 30 సెకన్లు) రన్‌టైమ్ కలిగిన థియేట్రికల్ ట్రైలర్ ఫైనల్‌గా లాక్ అయ్యింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి డబ్బింగ్ స్టూడియోలో ట్రైలర్ కట్‌ను ఓకే చేసిన ఫోటోను సోషల్ మీడియా వేదికపై షేర్ చేసి ఈ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.
Details
కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్
ఆ ఫోటోలో చిరంజీవి ఇంటెన్స్ యాక్షన్ సీన్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్ ఎక్సైట్‌మెంట్ పీక్స్‌కు చేరుకున్నారు. ఈ థియేట్రికల్ ట్రైలర్‌ను రేపు, జనవరి 4న, తిరుపతిలోని ఎస్‌వీ సినీప్లెక్స్‌లో మధ్యాహ్నం 3 గంటలకు గ్రాండ్ ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు. ఇక జనవరి 7న సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. స్టార్ హీరోయిన్ నయనతార ఫిమేల్ లీడ్‌గా కనిపిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి భారీ అంచనాలు ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అనిల్ రావిపూడి చేసిన ట్వీట్
Locked…Loaded…Ready to shoot 😉
— Anil Ravipudi (@AnilRavipudi) January 3, 2026
2 min 30 sec 🔥🔥#ManaShankaraVaraPrasadGaru Trailer out tomorrow 💥
See you all at SV CinePlex, Tirupati 🤗 pic.twitter.com/QbW0ULigGH