
Mohan Yadav: మధ్యప్రదేశ్ రైతులకు శుభవార్త.. రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్ రైతులకు కేవలం రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయనున్నట్లు సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. భోపాల్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
త్వరలోనే మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేని రైతులకు ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని ఆయన స్పష్టం చేశారు.
రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, వారి జీవితాలు మెరుగుపడాలని కోరుకుంటున్నట్లు సీఎం మోహన్ యాదవ్ అన్నారు.
నీటిపారుదల అవసరాల కోసం సోలార్ పైపుల ద్వారా రైతులకు విద్యుత్ సంబంధిత ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Details
సోలార్ విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు
రాబోయే మూడేళ్లలో 30 లక్షల సోలార్ ఇరిగేషన్ పంపులను రైతులకు అందించనున్నట్లు పేర్కొన్నారు.
అంతేకాదు ప్రభుత్వం రైతుల నుంచి సోలార్ విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో మౌలిక వసతులు, విద్యుత్తు, రోడ్లు కరువయ్యాయని, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు మెరుగుపడ్డాయని సీఎం మోహన్ యాదవ్ వ్యాఖ్యానించారు.