LOADING...
Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'RC16' ఫస్ట్‌లుక్ విడుదల!
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'RC16' ఫస్ట్‌లుక్ విడుదల!

Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'RC16' ఫస్ట్‌లుక్ విడుదల!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2025
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'RC16' నుంచి ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ ఫస్ట్‌లుక్ విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపింది. సరికొత్త లుక్‌లో రామ్ చరణ్ లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపిస్తుండగా, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేశారు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుందని టాక్‌. 'ఉప్పెన' తర్వాత సుమారు రెండేళ్లుగా బుచ్చిబాబు ఈ ప్రాజెక్ట్‌పై శ్రద్ధ పెట్టారు.

Details

చెర్రీ

ఇందులో రామ్ చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుందని సమాచారం. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించనున్నారు. మ్యూజిక్ దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే రెండు పాటల రికార్డింగ్ పూర్తయిందని ఇటీవలే ఆయన వెల్లడించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.