Page Loader
Satyam Sundaram: సినీ ప్రేమికులకు శుభవార్త.. ఓటీటీలోకి వచ్చేస్తున్న 'సత్యం సుందరం'
సినీ ప్రేమికులకు శుభవార్త.. ఓటీటీలోకి వచ్చేస్తున్న 'సత్యం సుందరం'

Satyam Sundaram: సినీ ప్రేమికులకు శుభవార్త.. ఓటీటీలోకి వచ్చేస్తున్న 'సత్యం సుందరం'

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2024
01:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

కార్తి, అరవింద్ స్వామి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సత్యం సుందరం' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ ఫీల్‌గుడ్‌ చిత్రాన్ని సూర్య, జ్యోతిక తక్కువ బడ్జెట్‌లో నిర్మించారు. సెప్టెంబర్ 28న థియేటర్‌లో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు ఓటిటిలోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక అయిన నెట్‌ఫ్లిక్స్ అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండనుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రానుంది.

Details

రూ.60 కోట్లు కలెక్షన్స్ సాధించిన సత్యం సుందరం

థియేటర్‌లో చూడలేకపోయిన ప్రేక్షకులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తప్పక చూడాల్సిన చిత్రమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ కథ చిత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది, ఎలాంటి ట్విస్ట్‌లేకుండా సుమారు 3 గంటలపాటు ప్రేక్షకులను అలరించింది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య, జ్యోతికలు ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 60 కోట్ల సాధించి మంచి లాభాలను అందించింది. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, కార్తి బావ-బావమరిదిగా నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.