raja saab pre release event: ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. 'రాజాసాబ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ కథానాయకుడిగా, దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ 'ది రాజాసాబ్' (The Raja Saab) ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని జనవరి 9న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎప్పుడన్న ఆసక్తితో ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ శుభవార్త అందించారు. డిసెంబరు 27న హైదరాబాద్‌లో 'ది రాజాసాబ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. అయితే ఈవెంట్‌కు సంబంధించిన వేదికతో పాటు ఇతర పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని, అభిమానులు కొంత వేచి చూడాలని తెలిపారు.
Details
మూడు గంటల నిడివి
ఇక ఈ సినిమా మూడు గంటలకు పైగా నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇటీవల ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ 3 గంటలకు మించిన రన్‌టైమ్‌తోనే విడుదలవుతున్నాయి. అయితే దర్శకుడు మారుతి సినిమాలు సాధారణంగా తక్కువ నిడివితో ఉండటం విశేషం. ఇద్దరి కలయికలో వస్తున్న తొలి చిత్రం కావడం, అలాగే హారర్ కామెడీ నేపథ్యంతో రూపొందుతున్న సినిమా కావడంతో 'ది రాజాసాబ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Details
స్టార్ క్యాస్ట్
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. విడుదల తేదీ మార్పు మొదట ఈ సినిమాను డిసెంబరులో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేసి జనవరి 9కి షిఫ్ట్ చేశారు. మొత్తంగా ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో వస్తున్న తొలి హారర్ థ్రిల్లర్ కావడంతో 'ది రాజాసాబ్'పై సినీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ భారీ ఆసక్తి కొనసాగుతోంది.