
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ది రాజాసాబ్' టీజర్‌పై ఎస్‌కేఎన్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం సెట్స్‌పై 'ది రాజా సాబ్' ఉంది.
రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్‌గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ తాతగా, మనవడిగా కన్పించనున్నాడు.
మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు కథానాయికలుగా నటిస్తుండగా, ప్రముఖ నటులు సంజయ్ దత్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక నయనతార ఒక ప్రత్యేక గీతంలో మెరబోతున్నట్టు సమాచారం.
ఈ సినిమా టీజర్‌పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మే నెలలో టీజర్‌ను విడుదల చేస్తామంటూ చిత్ర బృందం ఇటీవల ప్రకటించినా మే చివరి వారం ప్రారంభమైనా టీజర్‌పై ఎలాంటి అప్‌డేట్ లేదు
Details
రెండు వారాల్లో రిలీజ్
టీజర్ సిద్ధంగా ఉన్నా, వీఎఫ్ఎక్స్ పనుల వల్ల లేట్ అవుతోందని, ప్రభాస్ నుంచి ఇప్పటికీ అనుమతి రాలేదని టాక్ చక్కర్లు కొడుతోంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి సన్నిహితుడైన, సహా నిర్మాత ఎస్.కే.ఎన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మారుతితో ఇటీవలే మాట్లాడా. 'ది రాజా సాబ్' పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు.
టీజర్ విషయంలో క్లారిటీ ఉంది. రానున్న రెండు వారాల్లో టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నామని ఎస్‌కేఎన్ స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలతో అభిమానం పెరిగినప్పటికీ, అధికారిక ప్రకటన వచ్చేవరకు పూర్తిగా నమ్మలేని పరిస్థితిలో ఫ్యాన్స్ ఉన్నారు.
ఇప్పటికే ఆలస్యం కావడంతో, మరోసారి నిరాశ ఎదురవుతుందేమో అన్న గందరగోళం కొనసాగుతోంది. 'డార్లింగ్' ప్రభాస్ అభిమానులు ఈసారి నిజంగానే టీజర్ వస్తుందని ఆశపడుతూ ఎదురుచూస్తున్నారు.