Ram Charan - Prabhas:రెబల్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. ప్రభాస్ పెళ్లిపై రామ్ చరణ్ హింట్
ఈ వార్తాకథనం ఏంటి
సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రభాస్ వివాహంపై ఓ ఆసక్తికర సమాచారం బయటికొచ్చింది.
ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎవరిని వివాహం చేసుకుంటారు అనే విషయాలు తరుచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది.
అయితే ఆయన వివాహానికి సంబంధించి 'అన్‌స్టాపబుల్' షోలో బాలకృష్ణ ప్రశ్నించగా, రామ్‌చరణ్ నవ్వుతూ చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ ఆంధ్రప్రదేశ్‌లోని గణపవరానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నారని రామ్‌చరణ్ వెల్లడించారు.
Details
క్లీంకార గురించి మాట్లాడిన రామ్ చరణ్
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'అన్‌స్టాపబుల్' టాక్ షోలో రామ్ చరణ్ పలు విశేషాలను పంచుకున్నారు.
'గేమ్ ఛేంజర్' ప్రమోషన్‌లలో భాగంగా ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో పాల్గొన్న చరణ్, తన కుమార్తె క్లీంకార గురించి కూడా మాట్లాడారు.
పాప పుట్టిన తర్వాత తన జీవితంలో మార్పు చాలానే వచ్చిందని, ఉదయం 2 గంటల వరకు ఆమెతో ఆడుకుంటానని చెప్పాడు.
తన కుమార్తె ప్రైవసీ కోసం ఆమె ముఖాన్ని చూపించలేదన్నారు. ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్‌కు సంబంధించిన మరిన్ని విశేషాలు జానవరి 14న ప్రసారం కానున్న రెండో భాగంలో వినిపించనున్నాయి.