LOADING...
Dhurandhar 2: తెలుగు ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌.. 'ధురంధర్‌ 2' షోలు నేటి నుంచే!
తెలుగు ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌.. 'ధురంధర్‌ 2' షోలు నేటి నుంచే!

Dhurandhar 2: తెలుగు ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌.. 'ధురంధర్‌ 2' షోలు నేటి నుంచే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 21, 2026
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ 'ధురంధర్‌ 2' కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌ అందింది. ఈ సినిమా శనివారం నుంచి తెలుగులో విడుదల కానుందని సమాచారం. ఇప్పటికే మార్చి 21న ప్రారంభమయ్యే షోలకు తెలుగు వెర్షన్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఇదిలా ఉండగా 'ధురంధర్‌: ది రివెంజ్‌' సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల వెర్షన్లకు శుక్రవారం సెన్సార్‌ పూర్తయ్యింది. హిందీ వెర్షన్‌తో పోలిస్తే ఈ మూడు భాషల్లో సినిమా నిడివి స్వల్పంగా ఎక్కువగా ఉంది.

Details

సాంకేతిక కారణాలతో వాయిదా

హిందీలో ఈ చిత్రం 3 గంటల 49 నిమిషాల నిడివి ఉండగా, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 3 గంటల 51 నిమిషాలుగా ఉంది. అయితే కన్నడ వెర్షన్‌కు మాత్రం ఇంకా సెన్సార్‌ సర్టిఫికేట్‌ రాలేదు. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించారు. ఈ సినిమా హిందీ వెర్షన్‌ మార్చి 19న విడుదలై భారీ అంచనాలను అందుకుని థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. మొదట ఇతర భాషల్లో కూడా అదే రోజు విడుదల కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న నేపథ్యంలో, తెలుగు విడుదలపై ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి.

Advertisement