Jana Nayagan: విజయ్ అభిమానులకు శుభవార్త.. దళపతి కొత్త చిత్రానికి టైటిల్ అనౌన్స్
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాల నుంచి రాజకీయాల ప్రపంచంలో అడుగుపెట్టిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, తన తాజా చిత్రం కోసం అభిమానులు ఎంతో అతృతుగా ఎదురుచూస్తున్నారు.
సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులు ఈ సినిమా టైటిల్, విజయ్ ఫస్ట్ లుక్, ఇతర అప్‌డేట్ల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
విజయ్ తదుపరి చిత్రం 'దళపతి 69'కి సంబంధించిన టైటిల్ ని ఈ రోజు ప్రకటించారు.
రిపబ్లిక్ డే సందర్భంగా, మూవీ మేకర్స్ టైటిల్, విజయ్ ఫస్ట్ లుక్‌ను అభిమానులకు అందించారు.
Details
రాజకీయ నేపథ్యంలో మూవీ
కెవిఎన్ ప్రొడక్షన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు, సినిమా టైటిల్‌ను 'జన నాయగన్' అని ప్రకటించారు.
ఈ పోస్టర్ లో, విజయ్ వెనుక వేల సంఖ్యలో అభిమానులు ఉండగా, అతడు సెల్ఫీ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాడు.
సినిమా టైటిల్ చూసినప్పుడు, ఈ చిత్రం రాజకీయ నేపథ్యంతో రూపొందించనట్లు స్పష్టమవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అనౌన్స్ చేసిన చిత్రబృందం
We call him #JanaNayagan #ஜனநாயகன் ♥️#Thalapathy69FirstLook#Thalapathy @actorvijay sir #HVinoth @thedeol @prakashraaj @menongautham #Priyamani @itsNarain @hegdepooja @_mamithabaiju @anirudhofficial @Jagadishbliss @LohithNK01 @sathyaDP @ActionAnlarasu @Selva_ArtDir… pic.twitter.com/t16huTvbqc
— KVN Productions (@KvnProductions) January 26, 2025