LOADING...
Year Ender 2025: బ్యాచిలర్ జీవితానికి గుడ్‌బై.. ఈ ఏడాది పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు వీరే!
బ్యాచిలర్ జీవితానికి గుడ్‌బై.. ఈ ఏడాది పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు వీరే!

Year Ender 2025: బ్యాచిలర్ జీవితానికి గుడ్‌బై.. ఈ ఏడాది పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు వీరే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 20, 2025
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో 2025 సినీ, టెలివిజన్ రంగాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చిన అంశాల్లో సెలబ్రిటీ వివాహాలు ఒకటిగా నిలిచాయి. ఈ ఏడాది పలువురు ప్రముఖులు తమ బ్యాచిలర్ జీవితానికి వీడ్కోలు పలుకుతూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొందరు దీర్ఘకాల ప్రేమను పెళ్లిగా మార్చుకోగా, మరికొందరు పెద్దలు కుదిర్చిన వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. గ్లామర్, సంప్రదాయం, ఆధ్యాత్మికత సమ్మేళనంగా జరిగిన ఈ సెలబ్రిటీ వెడ్డింగ్స్‌ 2025ను ప్రత్యేకంగా నిలిపాయి.

Details

అఖిల్ అక్కినేని - జైనబ్

అక్కినేని కుటుంబ వారసుడు, కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గతేడాది అన్న నాగచైతన్య పెళ్లి జరగగా, ఈ ఏడాది తమ్ముడు అఖిల్ వివాహం కుటుంబంలో మరో శుభఘట్టంగా నిలిచింది. అఖిల్ - జైనబ్ వివాహం జూన్ 6న అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, సినీ ప్రముఖుల మధ్య ఈ వేడుక ఘనంగా నిర్వహించారు.

Details

సమంత - రాజ్ నిడిమోరు

ఈ ఏడాది అత్యంత అనూహ్యమైన వివాహంగా హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి నిలిచింది. వీరిద్దరి ప్రేమాయణంపై కొంతకాలంగా ఊహాగానాలు ఉన్నప్పటికీ, అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. అయితే డిసెంబర్ 1న తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈషా యోగా సెంటర్‌లో భూతశుద్ధి విధానంలో వివాహం చేసుకుని అందరికీ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. సమంతకు, రాజ్ నిడిమోరుకు ఇది రెండో వివాహం కావడం విశేషం.

Advertisement

Details

 అవికా గోర్ - మిలింద్ చంద్వానీ

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్ ఈ ఏడాది వివాహం చేసుకుంది. జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న అవికా, సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానీని తాజాగా వివాహం చేసుకుంది. 2019లో పరిచయమైన వీరిద్దరూ ఏడాది స్నేహం తర్వాత 2020 నుంచి ప్రేమలో ఉన్నారు. దాదాపు ఐదేళ్ల ప్రేమ ప్రయాణానికి పెళ్లితో ముగింపు పలికారు. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన అవికా, తెలుగులో 'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ' వంటి హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

Details

అర్చన కొట్టిగె - బీఆర్ శరత్

కన్నడ సినీ పరిశ్రమలో ఎదుగుతున్న నటి అర్చన కొట్టిగె తన ప్రియుడు, క్రికెటర్ బీఆర్ శరత్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. 2018లో 'అరణ్యకాండ' సినిమాతో అర్చన సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం 'వాసు నాన్ పక్కా కమర్షియల్', 'డియర్ సత్య', 'ట్రిపుల్ రైడింగ్' వంటి చిత్రాల్లో నటించింది. శరత్ 2024లో గుజరాత్ టైటాన్స్ తరపున IPL ఆడాడు. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకోవడం విశేషం.

Details

ఆశ్లేష సావంత్ - సందీప్ బస్వానా

హిందీ టెలివిజన్ రంగానికి చెందిన ప్రముఖ జంట ఆశ్లేష సావంత్ - సందీప్ బస్వానా దాదాపు 23 ఏళ్ల ప్రేమ ప్రయాణానికి పెళ్లితో ముగింపు పలికారు. ఈ జంట 2025 నవంబర్ 16న ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ చంద్రోదయ ఆలయంలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. 'క్యుంకి సాస్ భీ కభీ బహు థీ' వంటి హిట్ సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైన ఈ జంట, బుల్లితెర పరిచయాన్ని నిజ జీవిత ప్రేమగా మార్చుకున్నారు.

Details

హీనా ఖాన్ - రాకీ జైస్వాల్

బుల్లితెర నటి హీనా ఖాన్, టెలివిజన్ నిర్మాత రాకీ జైస్వాల్ దాదాపు 13 సంవత్సరాల సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత 2025 జూన్ 4న వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకథ 'యే రిష్తా క్యా కెహ్లతా హై' సీరియల్ సెట్స్‌లో మొదలైంది. ఆ షోలో హీనా నటిగా, రాకీ సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. హీనా‌కు స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అయిన సమయంలో రాకీ ఆమెకు అండగా నిలవడం ఈ జంట ప్రేమను మరింత బలంగా నిలిపింది. రాకీ జైస్వాల్ రచయిత, దర్శకుడు, నిర్మాతగా టెలివిజన్ పరిశ్రమలో గుర్తింపు పొందారు.

Details

అభిషన్ జీవింత్ - అఖిల

'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాతో దర్శకుడిగా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు అభిషన్ జీవింత్ తన చిన్ననాటి ప్రేయసి అఖిలను వివాహం చేసుకున్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ ప్రేమకు పెద్దల అంగీకారం లభించడంతో సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ వర్గాలకు చెందిన కొద్దిమంది మిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ వివాహం ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చకు దారి తీసింది.

Details

అర్మాన్ మాలిక్ - ఆష్నా ష్రాఫ్

ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్, ఫ్యాషన్ ఇన్‌ఫ్లూయెన్సర్ ఆష్నా ష్రాఫ్ తమ ప్రేమ బంధానికి వివాహంతో ముగింపు పలికారు. ఈ జంట 2025 జనవరి 2న మహాబలేశ్వర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది. అర్మాన్ మాలిక్ హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో పాటలు పాడి కోట్లాది అభిమానులను సంపాదించాడు. ఆష్నా ష్రాఫ్ ముంబైకి చెందిన ఫ్యాషన్ క్రియేటర్, బ్లాగర్, మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు పొందింది.

Advertisement